|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్: భార్యతో కలిసి ఊర మాస్ స్టెప్పులు.. వీడియో చూస్తే షాకే!

Published: 25-02-2026, 11:35 AM
షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్‌మెంట్: భార్యతో కలిసి ఊర మాస్ స్టెప్పులు.. వీడియో చూస్తే షాకే!
  • షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి చోడిశెట్టిల నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ అదిరింది అంతే!
  • వైరల్ వీడియో: కాబోయే భార్య వైష్ణవిని ఎత్తుకొని గింగిరాలు తిప్పిన షణ్ముఖ్ జస్వంత్!
  • బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు
  • ఫ్యాన్స్ ఫిదా! షణ్ముఖ్, వైష్ణవి జోడీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ

షణ్ముఖ్ జస్వంత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. వైష్ణవి చోడిశెట్టితో అతడి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.

వైరల్ వీడియోలో షణ్ముఖ్ రచ్చ

Shanmukh Jaswanth : కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పాటు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని షణ్ముఖ్ జస్వంత్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో కొన్నాళ్ళు దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ తర్వాత బ్రేకప్ అయింది.(Shanmukh Jaswanth)

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు పరిచయం చేసిన షణ్ముఖ్ నేడు తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ – వైష్ణవి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ గా మారగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నిశ్చితార్థంలో సందడి చేసిన జంట

ఫొటోలతో పాటు ఓ వీడియో కూడా షేర్ చేసి మరింత వైరల్ అవుతున్నాడు షన్ను. నిశ్చితార్థ వేడుకల్లో తనకు కాబోయే భార్యతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేసాడు షణ్ముఖ్. డ్యాన్స్ చేస్తూ వైష్ణవిని ఎత్తుకొని తిప్పాడు కూడా. నిశ్చితార్థ వేడుకల్లో షణ్ముఖ్ – వైష్ణవి సంతోషంతో ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు ఈ వీడియోతో తెలుస్తుంది. దీంతో షణ్ముఖ్ జస్వంత్ – వైష్ణవి డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.

ఫ్యాన్స్ ఫిదా.. విషెస్ వెల్లువ!

మీరు కూడా షణ్ముఖ్ – వైష్ణవి నిశ్చితార్థంలో డ్యాన్స్ చేసిన వీడియో చూసేయండి..

షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి చోడిశెట్టి‌ల జంట చూడముచ్చటగా ఉంది. వారి భవిష్యత్తు సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.