
శర్వానంద్ అభిమానులకు శుభవార్త! ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బిజీగా ఉన్న శర్వానంద్ తన 36వ చిత్రం ‘Sharwa36’ నుండి ఓ స్పెషల్ అప్‌డేట్‌ను ప్రకటించారు. మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను దీపావళి రోజున రివీల్ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
Key Points
శర్వానంద్ 'Sharwa36' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు; మాల్వికా నాయర్ హీరోయిన్.
దీపావళి శుభ సందర్భంగా 'Sharwa36' టైటిల్ ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా బైక్ రేసర్‌గా కనిపిస్తాడు.
శర్వానంద్ కొత్త చిత్రం Sharwa36
చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దీంతో పాటు ‘శర్వా-36’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తుండగా.. మాల్వికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. ‘ఒక ప్రత్యేక రోజున.. స్పెషల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నది. దీపావళి శుభ సందర్భంగా Sharwa36 టైటిల్‌ను ప్రకటించబోతున్నారు’ అని ఓ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో శర్య ఓ బైక్ రేసర్‌గా కనిపిస్తుండగా.. ప్రజెంట్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుంది. లింక్
దీపావళికి Sharwa36 టైటిల్ ప్రకటన
మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో
దీపావళి పండుగ సందర్భంగా ‘Sharwa36’ టైటిల్ ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శర్వానంద్ బైక్ రేసర్‌గా ఎలా అలరిస్తాడో చూడాలి. ఈ స్పెషల్ ప్రకటన సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.


