|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శర్వానంద్-అనుపమ మ్యాజిక్ రిపీట్: ‘భోగి’ నుండి డి-గ్లామరస్ అనుపమ ఫస్ట్ లుక్!

Published: 30-04-2026, 8:56 PM
శర్వానంద్-అనుపమ మ్యాజిక్ రిపీట్: 'భోగి' నుండి డి-గ్లామరస్ అనుపమ ఫస్ట్ లుక్!
  • శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ‘భోగి’ సినిమాతో మళ్ళీ జతకట్టారు.
  • అనుపమ ‘కందుల సులోచన రాణి’ పాత్రలో డి-గ్లామరస్ లుక్‌లో ఆకట్టుకుంది.
  • ఈ చిత్రం 1960ల నేపథ్యంతో కూడిన పీరియాడిక్ కథాంశం.
  • భోగి సినిమా 2026 ఆగస్టు 28న విడుదల కానుంది.

శతమానం భవతి హిట్ తర్వాత శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ‘భోగి’ సినిమాతో మళ్ళీ తెరపై సందడి చేయనున్నారు. తాజాగా విడుదలైన అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్, ఆమె డి-గ్లామరస్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పీరియాడిక్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

శర్వా-అనుపమ మ్యాజిక్ రిపీట్

Bhogi Movie:సాధారణంగా తెరపై కొన్ని కొన్ని జోడీలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్ (Sharwanand ) , అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) ఇప్పుడు మరొకసారి జోడీ కట్టారు . ఈ నేపథ్యంలోనే అనుపమకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ తాజాగా విడుదల చేయడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.. ఈ సినిమా పూర్తి విశేషాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సొంతం చేసుకున్న శర్వానంద్ చివరిగా నారీ నారీ నడుమ మురారీ, బైకర్ వంటి చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నారు. అయితే ఇప్పుడు హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్న ఈయన.. అందులో భాగంగానే భోగి అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 1960 నేపథ్యంలో సాగే ఈ కథకు అనుగుణంగా డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.

భోగి సినిమాలో “కందుల సులోచన రాణి ” పాత్రలో అనుపమ కనిపించనుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో అనుపమ సాధారణ ఇమేజ్ కి భిన్నంగా డి గ్లామరస్ పాత్రలో కనిపించడంతో ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. చేతిలో భోజనం క్యారేజీలు , మోదుగ ఆకులతో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అటు ఈ పోస్టర్ తో పాటు అదిరిపోయే క్యాప్షన్ కూడా జోడించింది చిత్ర యూనిట్. ” ప్రకృతి బిడ్డ.. గంగా నిలయం.. కందుల గర్వం.. భోగికి ప్రాణం” అంటూ అనుపమ గురించి మేకర్స్ వర్ణించారు.

“కందుల సులోచన రాణి”గా అనుపమ

ఉత్తర తెలంగాణ , మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, రోహిత్ పాటక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా శతమానం భవతి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

‘భోగి’ సినిమా విశేషాలు, విడుదల

ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 20107లో శతమానం భవతి సినిమా వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది సతీష్ వేగేశ్న రచన, దర్శకత్వంలో తెలుగు కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఉత్తమ ప్రజా దారుణ పొందిన చిత్రంగా నేషనల్ అవార్డును అందుకుంది . అంతేకాదు రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ జీఫైవ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Tags Anupama Parameshwaran sharwanand Share

‘భోగి’ సినిమాతో శర్వానంద్, అనుపమల మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.