|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ష‌ర్వానంద్ మూవీ ఓటీటీ బ్లాస్ట్! మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. రికార్డు బ్రేకింగ్ కామెడీ ట్రీట్!

Published: 03-02-2026, 9:05 PM
ష‌ర్వానంద్ మూవీ ఓటీటీ బ్లాస్ట్! మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. రికార్డు బ్రేకింగ్ కామెడీ ట్రీట్!
  • ష‌ర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది!
  • ఫిబ్రవరి 4 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి పండగే!
  • సంయుక్త మీనన్, సిరి హనుమంత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.. కామెడీ టైమింగ్ అదుర్స్!
  • ప్రేమ, పెళ్లి, బంధాల చుట్టూ తిరిగే కథ.. నవ్వులు, ఎమోషన్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్!

ష‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘నారీ నారీ న‌డుమ మురారి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు మీ అరచేతిలో. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్.

ఓటీటీలో ‘నారీ నారీ నడుమ మురారి’ సందడి

2026 సంక్రాంతికి రిలీజైన సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇందులో ఫస్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు సినిమా నారీ నారీ నడుమ మురారీ. శర్వానంద్ హీరోగా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన తెలుగు సినిమాల సందడి ఇక ఓటీటీలో షురూ అయింది. ముందుగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ఇవాళ (ఫిబ్రవరి 4) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

మూడు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్

నారీ నారీ నడుమ మురారి ఓటీటీ

నారీ నారీ నడుమ మురారి స్టోరీ

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో నవ్వుల విందు

ప్రేమించిన అమ్మాయితో గౌతమ్ పెళ్లి జరుగుతుండగా.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ దియా (సంయుక్త మీనన్) వచ్చి అడ్డుపడుతుంది. అలా గౌతమ్ పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి.

ఆ తర్వాత ఏమైంది? అసలు గౌతమ్ పెళ్లికి దియా ఎందుకు అడ్డు పడింది? గౌతమ్ తండ్రి కార్తీక్ (వీకే నరేష్) లేటు వయసులో పల్లవి (సిరి హనుమంత్)ని పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటీ? గౌతమ్ దియాకు ఎందుకు బ్రేకప్ అయింది? రామలింగం పెట్టిన కండిషన్ ఏంటీ? చివరికి నిత్యతో గౌతమ్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే నారీ నారీ నడుమ మురారి సినిమాను చూడాల్సిందే.

‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ఓటీటీలో విడుదలైంది. ఇక మీ ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూడండి. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.