
📌 Key Points
- శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికి విడుదల కానుంది – జనవరి 14న గ్రాండ్ రిలీజ్!
- ఈ చిత్రంలో శర్వానంద్‌తో పాటు సంయుక్తా మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు.
- టికెట్ల ధరలు MRPకే పరిమితం, అదనపు చార్జీలు ఉండవు – అభిమానులకు పండుగ ఆఫర్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, మూవీ టీమ్ ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సంక్రాంతికి శర్వానంద్ సందడి
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanandh) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari). సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
MRP ధరలకే టికెట్లు – బంపర్ ఆఫర్
అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ..‘ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్.. MRP ధరలకే టికెట్లు.. అదనపు చార్జీలు లేకుండా నారి నారి నడుమ మురారిని పొందండి..
ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎదురుచూపులు
నో ఎక్స్‌ట్రా చార్జ్.. ఓన్లీ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్’ అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో శర్వానంద్ తెల్ల పంచా కట్టుకొని చేతిలో పెద్ద కోడి పుంజును పట్టుకొని ఉన్నాడు. ఇక అతని బ్యాక్ గ్రౌండ్‌లో భోగి మంటలు, నైవేథ్యం చేస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘నారి నారి నడుమ మురారి’ మూవీ టీమ్ ఇచ్చిన ఈ గుడ్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


