
📌 Key Points
- శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ మూవీ టీజర్ విడుదలైంది, సంక్రాంతికి నవ్వులు ఖాయం.
- సినిమా జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు విడుదల కానుంది.
- ఇద్దరు ప్రేయసిల మధ్య నలిగిపోయే పాత్రలో శర్వానంద్ కామెడీ ప్రధాన ఆకర్షణ.
- సంక్రాంతికి విడుదల కానున్న ఇతర పెద్ద సినిమాలతో ఈ చిత్రం పోటీపడనుంది.
శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ టీజర్ విడుదలైంది. సంక్రాంతికి నవ్వులు ఖాయమని టీజర్ ప్రకటించింది. ఇద్దరు ప్రేయసిల మధ్య శర్వానంద్ కామెడీ ఆకట్టుకుంటుంది. జనవరి 14 సాయంత్రం 5.49 గంటలకు ఈ చిత్రం విడుదల కానుంది. ఫుల్ వినోదం సిద్ధంగా ఉంది.
టీజర్ హైలైట్స్ & కథాంశం
శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారీ మూవీ టీజర్ వచ్చేసింది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నవ్వులు గ్యారెంటీ అని తేల్చేసింది. మూవీ జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు రానుండటం విశేషం.
శర్వానంద్ నటించిన బైకర్ మూవీ రిలీజ్ వాయిదా పడినా అతని నెక్ట్స్ మూవీ నారీ నారీ నడుమ మురారీ మాత్రం అనుకున్న సమయానికే రానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్ ను సోమవారం (డిసెంబర్ 22) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు ప్రేయసిల మధ్య నలిగిపోయే పాత్రలో నవ్వులు పూయిస్తున్నాడు శర్వానంద్.
విడుదల తేదీ, సమయం వివరాలు
నారీ నారీ నడుమ మురారీ టీజర్
సామజవరగమన ఎంతలా నవ్వించిందో మనకు తెలుసు. దీంతో ఈ నారీ నారీ నడుమ మురారీపైనా అంచనాలు పెరిగిపోయాయి. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న శర్వా జీవితంలోకి అతని పాత గర్ల్‌ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. కామెడీ పాత్రలో శర్వా అదరగొట్టబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
సంక్రాంతి రేసులో ‘నారీ నారీ నడుమ మురారీ’
నారీ నారీ నడుమ మురారీ రిలీజ్ డేట్, టైమ్
ఇప్పటికే సంక్రాంతికి ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తిలాంటి సినిమాలు రానుండటంతో వాటి మధ్య ఈ నారీ నారీ నడుమ మురారీ మూవీ ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఓసారి శతమానం భవతితో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన అతడు.. ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
సంక్రాంతి రేసులో ‘నారీ నారీ నడుమ మురారీ’ ఎలా రాణిస్తుందో చూడాలి. శతమానం భవతితో హిట్ కొట్టిన శర్వానంద్, ఈసారి కూడా నవ్వుల మ్యాజిక్ రిపీట్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.


