
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, అర్చనా జోడీ నటించిన ‘షష్టిపూర్తి’ సినిమా మే 30న విడుదలవుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కీరవాణి, ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
Key Points
రాజేంద్ర ప్రసాద్, అర్చనా జోడీ నటన
కీరవాణి, ఇళయరాజా సంగీతం
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే కథ
‘షష్టిపూర్తి’ విడుదల తేదీ ప్రకటన
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), అర్చనా(Archana) జోడీగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షష్టి పూర్తి’(Shashtipoorthi) . ఈ సినిమాలో రూపేష్, ఆకాంక్ష సింగ్(Akanksha Singh) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని పవన్ ప్రభ(Pawan Prabha) తెరకెక్కిస్తున్నారు. దీనిని ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ నిర్మిస్తున్నారు. అయితే సౌత్ సినీ రంగంలో సంగీత దిగ్గజాలు కీరవాణి, ఇళయరాజా ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేయడం మరొక ఆసక్తికరమైన విషయం. ఓ పాటకు ఇలయరాజా స్వరాలు అందించగా, ఒక పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సాహిత్యం అందించారు. ఇద్దరూ కలసి పనిచేసిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇలయరాజా కంపోజ్ చేసిన ‘ఏదో ఏదేదో’ పాటకు కీరవాణి రాసిన పదాలు ప్రస్తుతం సంగీతప్రియులను మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం అప్డేట్ విడుదల చేస్తూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. ‘షష్టిపూర్తి’ సినిమా మే 30న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘మీ హృదయాల్లో చాలాకాలం పాటు ఉండే కథను మీ ముందుకు తీసుకురాబోతున్నాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ప్రజెంట్ సమ్మర్ హాలీడేస్ రావడంతో చాలామంది ఫ్యామిలీ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఎక్కువగా.. లవ్ చిత్రాలే రాబోతుండటంతో అంతా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ‘షష్టిపూర్తి’ రాబోతుండటంతో సినీ ప్రియులు ఆనంద పడుతున్నారు.
కీరవాణి, ఇళయరాజా సంగీత విశేషాలు
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘షష్టిపూర్తి’
‘షష్టిపూర్తి’ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నందున, ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందించడం ఖాయం. కీరవాణి, ఇళయరాజా సంగీతం మరో ఆకర్షణ.


