
శివ కార్తికేయన్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మదరాసి థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. అక్టోబర్ 1 నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమా కథ హీరో రఘు భ్రమలు, సూసైడ్ ఆలోచనలు, ఓ ఎన్ఐఏ ఆపరేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పూర్తి వివరాలు చూద్దాం.
Key Points
శివ కార్తికేయన్ నటించిన 'మదరాసి' సైకలాజికల్ థ్రిల్లర్ నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అక్టోబర్ 1 నుండి ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు సహా 5 భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.
రఘు (శివ కార్తికేయన్) అనే కార్ షోరూమ్ ఉద్యోగి భ్రమలో బతికి, సూసైడ్ ఆలోచనలు, ఎన్ఐఏ ఆపరేషన్ తో ముడిపడి ఉన్న కథ.
సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆర్థికంగా విఫలమవడంతో త్వరగా ఓటీటీలోకి వచ్చింది.
మదరాసి ఓటీటీ విడుదల: ఎప్పుడు, ఎక్కడ?
థియేటర్లలో విడుదలైన కేవలం నెల రోజుల్లోపే తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మదరాసి ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 1) డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏఆర్ మురగదాస్ డైరెక్టర్.
శివకార్తికేయన్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మదరాసి ఓటీటీ లోకి వచ్చేసింది. దసరా సందర్భంగా ఒక రోజు ముందే నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది మదరాసి. శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమాల్, బిజు మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్ తదితరులు నటించిన ఈ చిత్రం అక్టోబర్ 1 నుండి ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంతో సహా 200 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాలలో ఉన్న ప్రైమ్ సభ్యులు మదరాసిని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో చూడవచ్చు.
కథాంశం: హీరో భ్రమ, సూసైడ్ ఆలోచనలు
ఏఆర్ మురుగదాస్, శివ కార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ మదరాసి . ఇది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సక్నిల్క్ ప్రకారం మదరాసి చిత్రం ఇండియాలో రూ.61.86 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లలో రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.
మదరాసి మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా మంది దర్శకుడు మురుగదాస్ కు ఇది కమ్ బ్యాక్ సినిమా అని అన్నారు. అయితే సినిమా మాత్రం బిజినెస్ పరంగా ఫెయిల్ అయింది. పెట్టిన బడ్జెట్ కూడా అందుకోలేదు. అందుకే ఓటీటీలోకి త్వరగా తీసుకొచ్చారని తెలిసింది.
బాక్సాఫీస్ vs ఓటీటీ ఫలితం
తమిళనాడు నేపథ్యంలో రూపొందిన మదరాసి రఘు (శివ కార్తికేయన్) కథను అనుసరిస్తుంది. రాఘు ఒక కార్ షోరూమ్ ఉద్యోగి. అతను రహస్యంగా ఒక అరుదైన మానసిక రుగ్మత (బాధలో ఉన్నవాళ్లందరూ తన వాళ్లే అనుకుని హీరో బాధపడుతుంటాడు)తో బాధపడుతుంటాడు. దాని కారణంగా అతను తన బంధువులను కోల్పోయాడని నమ్ముతాడు. ఈ సైకలాజికల్ జబ్బు కారణంగా తన గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోతుంది. అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు.
కానీ తమిళనాడులో అక్రమంగా చొరబడ్డ ఆయుధాలను పేల్చేయడానికి ఎన్ఐఏ అధికారి ప్రేమ్‌నాథ్ (బిజు మీనన్) రఘును వాడుకుంటాడు. ఒక సిలిండర్ గ్యాస్ ఫ్యాక్టరీలోకి వెళ్లమని నియమిస్తాడు. ఆ ఫ్యాక్టరీ ఆయుధ సిండికేట్ కోసం ఆయుధ నిల్వ కేంద్రంగా పనిచేస్తుంది. రఘు బలహీనమైన మానసిక స్థితి, అతని భయానక గతం, దంత వైద్య విద్యార్థిని, గాయని అయిన మాలతి (రుక్మిణి వసంత్)తో అతని అనుబంధం కథను మలుపు తిప్పుతాయి. విద్యుత్ జమాల్ విరాట్ పాత్రలో ప్రతినాయకుడిగా నటించారు. విక్రాంత్ చిరాగ్‌గా నటించారు.
మదరాసి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆర్థికంగా నిరాశపరిచింది. అందుకే త్వరగా ఓటీటీలోకి వచ్చింది. శివ కార్తికేయన్ నటన, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు ప్రధాన ఆకర్షణలు.


