
📌 Key Points
- శివాజీ వ్యాఖ్యలపై అనసూయ కౌంటర్ ఇవ్వడంతో దుస్తుల వివాదం మరింత ముదిరింది.
- సీనియర్ నటుడు సుమన్ స్పందిస్తూ ‘సామాన్లు’ పదం వాడటం తప్పని అభిప్రాయపడ్డారు.
- సినిమాలో ధరించే దుస్తులు, బయట ధరించే దుస్తులు వేరని సుమన్ నొక్కి చెప్పారు.
- సిల్క్ స్మిత వంటి నటీమణులు బయట చాలా సాధారణంగా కనిపించేవారని ఉదాహరించారు.
శివాజీ-అనసూయల మధ్య దుస్తులపై నెలకొన్న వివాదంపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. ‘సామాన్లు’ పదం వాడటం తప్పన్నారు. బయట దుస్తుల ఎంపిక విషయంలో జాగ్రత్త అవసరమని, రీల్, రియల్ లైఫ్ వేరని సిల్క్ స్మిత ఉదాహరణతో వివరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
శివాజీ-అనసూయ దుస్తుల వివాదం: రాశి కౌంటర్
హీరోయిన్లు ధరించే బట్టలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణం అయ్యాయి. శివాజీకి కౌంటర్ ఇస్తూ అనసూయ కామెంట్స్ చేయడం, సోషల్ మీడియా పోస్ట్ లు చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి రాశి.. అనసూయ తన బాడీ గురించి రాశి గారి ఫలాలు అంటూ వల్గర్ గా మాట్లాడింది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఏవేవో పోస్ట్ లు పెడుతోంది అంటూ కౌంటర్ ఇచ్చింది.
దీనితో రాశి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శివాజీ, అనసూయ వివాదంపై తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా స్పందించారు. శివాజీ సామాన్లు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అది తప్పే. దానికి శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదాన్ని మరో కోణంలో కూడా చూడాలి. సినిమాల్లో వేసుకునే డ్రెస్సులు, అక్కడ కనిపించే విధానం వేరు. కానీ బయటకి వచ్చినప్పుడు మాత్రం డ్రెస్సింగ్ జాగ్రత్తగా ఉండాలి. అది రీల్ లైఫ్.. ఇది రియల్ లైఫ్.
సుమన్ దృష్టిలో రీల్ లైఫ్ vs రియల్ లైఫ్ డ్రెస్సింగ్
అప్పట్లో జయమాలిని, విజయలలిత, సిల్క్ స్మిత లాంటి డ్యాన్సర్లు సినిమాల్లో నటించేటప్పుడు, డ్యాన్స్ చేసేటప్పుడు ఆ రకమైన కాస్ట్యూమ్స్, మేకప్ వేసుకునేవాళ్ళు. బయట మాత్రం చాలా నార్మల్ గా కనిపించేవారు. నేను జ్యోతి లక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత లతో నటించాను. వాళ్ళు వర్క్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక దేవాలయం లాగా భావించేవారు. చాలా ప్రొఫెషనల్ గా ఉండేవారు. అక్కడ ఎలా కనిపించాలో అలా కనిపించి, ఎలా డ్యాన్స్ చేయాలో అలా చేసి వెళ్లేవారు.
సినిమాలో ధరించే బట్టలని బయట అస్సలు ధరించేవారు కాదు. బయట నార్మల్ గా కనిపించేవారు. బయట వివిధ రకాలుగా ఉండే జనాలు ఉంటారు. ఏదైనా జరిగిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. అందుకే సినిమా వేరు, నిజ జీవితం వేరు. సినిమాలో ధరించే బట్టలని బయట ధరించడం కరెక్ట్ కాదు అని సుమన్ అన్నారు.
సిల్క్ స్మిత ప్రొఫెషనలిజం: సుమన్ వివరణ
ఇప్పుడున్న యంగ్ స్టర్స్ కి సరైన గైడెన్స్ లేదు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ వాళ్లకు అర్థం అవుతాయి అని సుమన్ పేర్కొన్నారు. సుమన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చకు దారితీస్తున్నాయి. యంగ్ స్టర్స్ కు సరైన గైడెన్స్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ప్రపంచంలో ప్రొఫెషనలిజం, నిజ జీవితంలో హుందాతనం మధ్య సమతుల్యత ప్రాముఖ్యతను సుమన్ సందేశం గుర్తుచేస్తుంది.



Zareen Khan Blasts Photographer Over Inappropriate Remark, Video Goes Viral