|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హే బలవంత్ సక్సెస్ వెనుక శివానీ సీక్రెట్స్! 100 సినిమాలే కాదు, కథే ముఖ్యం అంటున్న హీరోయిన్!

Published: 16-02-2026, 2:05 PM
  • శివానీ నాగారం, సుహాస్ కలిసి ‘హే బలవంత్’ చిత్రంలో నటించారు.
  • ‘లిటిల్ హార్ట్స్’ తర్వాత శివానీ నాగారానికి ఇది మరో ముఖ్యమైన చిత్రం.
  • ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరినీ కదిలిస్తుందని శివానీ అన్నారు.
  • తన పాత్రలో కామెడీ, ఇన్నోసెన్స్ కలగలసి ఉంటాయని ఆమె తెలిపారు.

శివానీ నాగరం, సుహాస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివానీ తన సినిమా అనుభవాలను, పాత్ర గురించి ప్రత్యేకంగా మీడియాతో పంచుకున్నారు.

హే బలవంత్ చిత్రంలో శివానీ నాగారం

Shivani Nagaram: గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బలవంత్’ (Hey Balwanth) (‘హే భగవాన్’ టైటిల్‌ని మార్చారు). సుహాస్ (Suhas), శివానీ నాగారం (Shivani Nagaram) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీవాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం.. మరోసారి అలాంటి సక్సెస్‌ను కొడతాననే ధీమాను వ్యక్తం చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శివానీ నాగారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

సినిమా గురించి శివానీ ఏమన్నారంటే…

‘‘నేను సుహాస్‌తో చేస్తున్న రెండో సినిమా ఇది. నా కెరీర్‌లో మూడోసినిమా. సుహాస్‌తో ఇంతకు ముందు చేసిన సినిమాలో చాలా ఇంటెన్స్‌ క్యారెక్టర్‌ చేశాను. ఇందులో మాత్రం చాలా లైటర్‌ వెయిన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర. చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. సినిమా మొత్తం ఆడియన్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అవుతారు. చివర్లో ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌ అందరినీ టచ్ చేస్తుంది. సినిమాను అందరూ ఎంజాయ్‌ చేస్తారు. నాపాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నాకు వచ్చిన కథలలో ది బెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను. ఫస్ట్‌ సినిమాలో కామెడీ లేదు. సెకండ్‌ సినిమాలో ఫుల్‌ కామెడీ, ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది. వినగానే కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా ఓకే చేశాను. ఇక ఇందులో ఉన్న బిజినెస్‌కు, నాకు ఏం సంబంధం లేదు. అదంతా సుహాస్ అండ్ ఫ్యామిలీ బిజినెస్సే.

కుటుంబ సహకారం, భవిష్యత్ ప్రాజెక్ట్స్

మా ఇంట్లోని వారంతా చాలా సపోర్టింగ్‌ ఉన్నారు కాబట్టే.. నేను సినిమాలు చేస్తున్నాను. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్నాను. వాళ్లు కూడా చాలా హ్యపీగా ఉన్నారు. ‘లిటిల్‌ హార్ట్స్‌’తో వచ్చిన సక్సెస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని తదుపరి సినిమా కమిట్‌ అవుతాను. కానీ, కథ నచ్చితేనే కాంబినేషన్‌తో సంబంధం లేకుండా సినిమా ఒప్పుకుంటాను. ఏదైనా కథ విన్నప్పుడు, ఆ కథతో నేను కనెక్ట్‌ అవుతున్నానా? నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? అనేది చూసుకుంటాను. సినిమాలో నా ప్రాధాన్యత ఏంటనేది చూసుకునే, ఒప్పుకుంటాను. ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాకు నేను చివరిలో సెలెక్ట్‌ అయ్యాను. జెన్యూన్‌గా నేను యాక్టర్‌ అవ్వాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఓ గుర్తింపు వచ్చింది. అలాగే లక్కీగా మంచి సినిమాలు పడ్డాయి. మంచి టీమ్స్, మంచి సహానటులు దొరికారు. నాకు వచ్చిన వాటిలో ది బెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 100 సినిమాలు చేయాలనేం లేదు. నేనను చేసినవి ఐదు సినిమాలు అయినా మంచి కథలతో చేసి, ప్రేక్షకులతో మంచి నటిని అనిపించుకుంటే చాలు. నాకు కథ, నా పాత్ర నచ్చితే స్టార్ హీరోల సినిమాలైనా ఒప్పుకుంటాను. ఎటువంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆడియన్స్‌ ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోవటమే ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు.

శివానీ నాగారం ‘హే బలవంత్’ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.