
వయసు పెరిగినా గ్లామర్ తగ్గలేదని నిరూపిస్తూ హీరోయిన్ శ్రియ సరన్ 43 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘నాన్ వయలెన్స్’ సినిమాలో ‘కనకం’ పాటతో ఆమె డ్యాన్స్, అందం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నెటిజన్లు ఆమె గ్లామర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Key Points
43 ఏళ్ల వయసులోనూ శ్రియ సరన్ 'నాన్ వయలెన్స్'లో ఐటమ్ సాంగ్ చేసింది.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించిన శ్రియ వివాహం చేసుకుని ఒక పాపకు తల్లి అయ్యింది.
'కనకం' అంటూ సాగే ఈ పాటలో ఆమె గ్లామర్ అస్సలు తగ్గలేదని నిరూపించింది.
నెటిజన్లు, అభిమానులు శ్రియ అందంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వయసు పెరిగినా తగ్గని గ్లామర్
సాధారణంగా వయసు పెరిగిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. చాలామంది విషయంలో ఇలా జరిగింది కూడా. కానీ కొందరు మాత్రం పెద్దవాళ్లు అవుతున్నా గ్లామర్ విషయంలో అస్సలు తగ్గట్లేదు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకు అయితే 50 ఏళ్లు దాటిపోయాయి. కానీ మొన్నీమధ్యే వచ్చిన ‘థామా’లో ఐటమ్ సాంగ్ చేసింది.
‘నాన్ వయలెన్స్’లో శ్రియ ఐటమ్ సాంగ్
అసలు విషయానికొస్తే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోల సరసన నటించిన శ్రియ.. 2018లో ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత ఈమెకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతానికైతే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. రీసెంట్ టైంలో అయితే హిట్ మూవీ ‘మిరాయ్’లో తల్లి పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఓ తమిళ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఆశ్చర్యపరిచింది.
‘నాన్ వయలెన్స్’ పేరుతో తీస్తున్న ఓ సినిమాలో ‘కనకం’ అంటూ సాగే ఐటమ్ పాటలో శ్రియ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఈ ఏడాది రిలీజైన సూర్య ‘రెట్రో’లోనూ ఐటమ్ సాంగ్ చేసింది గానీ ఎందుకనో అది పెద్దగా వైరల్ కాలేదు. ఇప్పుడొచ్చిన పాట మాత్రం శ్రియ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ ఈ రేంజ్ అందం మెంటైన్ చేస్తోందని నెటిజన్లు, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.
నెటిజన్ల ఆశ్చర్యం, అభిమానుల స్పందన
మొత్తానికి 43 ఏళ్ల వయసులోనూ శ్రియ సరన్ తన అద్భుతమైన గ్లామర్, డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, ఈ ఐటమ్ సాంగ్ ఆమె కెరీర్‌కు మరింత జోష్ తెచ్చింది.


