
📌 Key Points
- మల్కాజ్ గిరిలో ‘శుద్ద్ విలాస్’ అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కొత్తగా ప్రారంభమైంది.
- హీరో శ్రీ విష్ణు ఈ బ్రాంచ్‌ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడి వంటకాలను రుచి చూసి ప్రశంసించారు.
- ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌లో క్లీన్, క్వాలిటీ, హెల్దీ శాకాహారానికి డిమాండ్ పెరిగిందని శ్రీ విష్ణు అన్నారు.
- బ్రాండ్ యజమానులు శశికాంత్, శ్రీరామ్ భారతీయ శాకాహార సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చి, విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు.
మల్కాజ్ గిరిలో పసందైన శాకాహార వంటకాలతో ‘శుద్ద్ విలాస్’ రెస్టారెంట్ ప్రారంభమైంది. హీరో శ్రీ విష్ణు ఈ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి, అక్కడి రుచులను ఆస్వాదించారు. శాకాహారానికి ఆదరణ పెరుగుతుందని, ఈ రెస్టారెంట్ హాట్ ఫేవరేట్ అవుతుందని ఆయన అన్నారు.
శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘శుద్ద్ విలాస్’ ప్రారంభం
శాకాహారుల కోసం ప్రత్యేకమైన రెస్టారెంట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఇక ప్యూర్ వెజ్ రెస్టారెంట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. రకరకాల వంటకాలతో, పసందైన రుచులతో శాకాహారుల్ని ఆకట్టుకునేందుకు నగరంలో ‘శుద్ద్ విలాస్’ ప్రారంభమైంది. మల్కాజ్ గిరిలో ఈ న్యూ బ్రాంచ్‌ను సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు ఓపెన్ చేశారు. రెస్టారెంట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ అన్ని రకాల వంటకాలను రుచి చూశారు.
శాకాహారానికి పెరుగుతున్న ఆదరణ: శ్రీ విష్ణు
అన్ని రకాల వెరైటీ వంటకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా.. శ్రీ విష్ణు (Sri Vishnu)మాట్లాడుతూ.. ‘నేటి అర్బన్, బిజీ లైఫ్ స్టైల్‌లో క్లీన్, క్వాలిటీ, హెల్దీ ఫుడ్‌కు డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా శాకాహార భోజనాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. వెజ్‌నే అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ప్రారంభించిన ‘శుద్ద్ విలాస్’ (Shuddh Vilas)యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్. శాకాహార ప్రియులందరికీ ఈ రెస్టారెంట్ హాట్ ఫేవరేట్‌గా మారుతుందని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.
యజమానుల లక్ష్యం, భవిష్యత్ ప్రణాళికలు
బ్రాండ్ యజమానులు శశికాంత్(Shashikanth), శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ ‘శుద్ధ్ విలాస్’ను భారతీయ పాక శాస్త్ర సంప్రదాయాల్లోని ప్రామాణిక శాకాహార వంటకాలను అందించే లక్ష్యంతో, స్వచ్ఛత, స్థిరత్వం, భోజన ప్రియుల సంతృప్తి కోసం రాజీలేని ప్రమాణాలను కొనసాగిస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో బ్రాండ్‌ను ఇతర ప్రదేశాలకు విస్తరించే ప్రణాళికలను కూడా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కూడా ఇక్కడి రుచికరమైన భోజనాన్ని ఆస్వాధించారు.
శ్రీ విష్ణు ప్రశంసలతో ప్రారంభమైన ‘శుద్ద్ విలాస్’ శాకాహార ప్రియులకు కొత్త గమ్యస్థానంగా మారనుంది. స్వచ్ఛత, రుచికి ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యజమానులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

