
హర్షవర్ధన్ రాణే నటించే ‘సిలా’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా, హీరోయిన్‌గా సాదియా ఖతీబ్‌ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.
Key Points
హర్షవర్ధన్ రాణే, సాదియా ఖతీబ్ నటించే 'సిలా' సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.
సాదియా ఖతీబ్ 'సిలా' పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
సాదియా ఖతీబ్ పవర్‌ఫుల్ లుక్‌తో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
‘సిలా’ సినిమా షూటింగ్ ప్రారంభం
బాలీవుడ్ యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే(Harshavardhan Rane) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సిలా’. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఓముంగ్ కుమార్(Omung Kumar) తెరకెక్కిస్తున్నారు. దీనిని జీ స్టూడియోస్, బ్లూలోటస్ పిక్చర్స్, స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ ఇండియా బ్యానర్స్‌పై ఓముంగ్ కుమార్, ఉమేష్ భన్సాల్, ప్రగతి దేశ్‌ముఖ్, హిమాన్షు తివారి, అజయ్ సింగ్, ధనుంజయ్ సింగ్, అభిషేక్ అంకుర్(Abhishek Ankur), రాహుల్‌బలి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇక ఇందులో హర్షవర్దన్ విరాట్ పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సిలా’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇందులో సిలా పాత్రలో యంగ్ హీరోయిన్ సాదియా ఖతీబ్(Sadia Khatib) నటిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో సాదియా షర్ట్‌ను నడుముకు కట్టి రక్తాలు కారుతుండగా.. పెద్ద కత్తిని చేతిలో పట్టుకుని విలన్స్‌ను హతమారుస్తోంది. ఆమె పోస్టర్ వెనగాల మంటలు వస్తుండగా.. సాదియా కోపంగా పవర్ లుక్‌లో కనిపించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ హీరోయిన్ సాదియా ‘‘ఎన్నో ఒడిదుడుకుల తర్వాత, కష్టాలతో కూడిన ప్రేమ నాకు లభించింది. ‘సిలా’కు శత్రువు కూడా తల వంచుకోవాల్సిందే ’’ అనే క్యాప్షన్ జత చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.
హీరోయిన్‌గా సాదియా ఖతీబ్
పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల
సాదియా ఖతీబ్ పవర్‌ఫుల్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘సిలా’ సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.


