|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్ సంచలనం: బాలయ్యను ‘ఇడియట్, రాస్కెల్’ అని తిట్టిన సిల్క్ స్మిత! సెట్ లో బిగ్ షాక్!

Published: 10-07-2026, 1:16 AM
  • ఆదిత్య 369 షూటింగ్ లో సిల్క్ స్మిత బాలయ్యను ఇంగ్లీషులో తిట్టిన అరుదైన ఘటన వెలుగులోకి.
  • తెలుగు డైలాగ్ మర్చిపోయి, ఆవేశంలో ‘ఇడియట్, రాస్కెల్’ అంటూ బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • సెట్లో అందరూ షాక్ అవ్వగా, డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు నవ్వుతూ సరదాగా స్పందించారు.
  • బాలకృష్ణ స్వయంగా వెల్లడించిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ చరిత్రలో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు చోటు చేసుకున్నాయి. నందమూరి బాలకృష్ణ, సిల్క్ స్మిత మధ్య ‘ఆదిత్య 369’ సెట్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం!

బాలయ్యకు సిల్క్ స్మిత షాకింగ్ తిట్లు!

ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది.. అదొక సెపరేట్ వరల్డ్.. ఎన్నో సినిమాలు, షూటింగ్ లో,మర్చిపోలేని సంఘటను.. తవ్వినా కొద్ది వస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు మాత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటనను నందమూరి బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఆదిత్య 369’ సినిమా షూటింగ్ సమయంలో నటి సిల్క్ స్మిత, బాలకృష్ణను ఇంగ్లీషులో ఘాటుగా తిట్టిన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. ఆ సమయంలో సెట్‌లో ఉన్నవారంతా షాక్‌కు గురైన సంఘటన గురించి ఆయన వివరించారు.

బాలకృష్ణ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఆదిత్య 369 సినిమాలో సిల్క్ స్మిత కేవలం ఒక ఐటమ్ సాంగ్‌కే పరిమితం కాకుండా, సింహనందిని అనే ఒక పూర్తి స్థాయి పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆమెకు ఒక కీలకమైన సీన్ ఉంది. అందులో బాలకృష్ణ పోషించిన కృష్ణ కుమార్ పాత్రను ఉద్దేశించి ఆమె “ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు” అంటూ తెలుగులో పెద్ద డైలాగ్ చెప్పాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సిల్క్ స్మితకు తెలుగు అంతగా రాదు . పైగా ఆ డైలాగ్‌లో ఉన్నది తెలుగు మాత్రమే కాదు కాస్త గ్రాంథికం భాష కూడా కావడంతో ఆమెకు పలకడం చాలా కష్టంగా అనిపించింది

‘ఆదిత్య 369’ సెట్లో ఏం జరిగింది?

షూటింగ్ టేక్ ప్రారంభం కాగానే, సిల్క్ స్మిత ఆ తెలుగు డైలాగ్‌ను పూర్తిగా మర్చిపోయింది. భావోద్వేగంతో డైలాగ్ చెప్పాల్సిన ఆ సీన్ లో, ఆమె తెలుగుకు బదులుగా ఇంగ్లీషులోకి మారిపోయి.. బాలకృష్ణను చూపిస్తూ.. “దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కల్” (This fool, This idiot, This bastard, This rascal) అంటూ చాలా కోపంగా తిట్టేసింది. ఆవేశంతో అలా తిట్టేసి, ఆ తర్వాత డైరెక్టర్‌ వైపు తిరిగి “డైరెక్టర్ గారు.. ఓకేనా అండి?” అని చాలా సాదాసీదాగా అడిగింది.

డైరెక్టర్ సింగీతం రియాక్షన్ చూసి షాక్!

సిల్క్ స్మిత నోటి వెంట బాలకృష్ణ లాంటి స్టార్ హీరోపై ఆ రేంజ్ ఇంగ్లీష్ తిట్లు వినేసరికి సెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు స్పందిస్తూ, నవ్వుతూ “ఓకే ఏంటమ్మా.. నువ్వు మాట్లాడిందంతా ఇంగ్లీషు, పైగా అన్ని తిట్లే తిట్టావు” అని చెప్పారు. ఆ తర్వాత సెట్‌లో అందరూ నవ్వుకున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ గుర్తుచేసుకుంటూ ఆ సమయంలో ఆ సీన్ చాలా సరదాగా సాగిందని నవ్వేశారు .

సిల్క్ స్మిత, బాలకృష్ణ మధ్య జరిగిన ఈ సరదా సంఘటన టాలీవుడ్ చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తలు, అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.