|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సిల్క్ స్మితనే అప్పటి పుష్ప! డైరెక్టర్ కామెంట్స్ వైరల్!!

Published: 10-04-2026, 2:35 PM
  • సిల్క్ స్మిత స్టైల్ అంటే అదే వేరు; ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే!
  • దర్శకుడు జయకుమార్ మాటల్లో సిల్క్ స్మిత నిజంగానే అప్పటి ‘పుష్ప’ అంట!
  • సిల్క్ స్మిత కళ్ళల్లోని మ్యాజిక్ వల్లే ఆమె అంతలా ఆదరణ పొందింది – వైరల్ కామెంట్స్!
  • కమల్ హాసన్‌తో సిల్క్ స్మిత కాంబినేషన్ ఒక సెన్సేషన్ అని డైరెక్టర్ వెల్లడి.

సిల్క్ స్మిత.. ఒకప్పుడు ఆమె పేరు ఒక ఊపు ఊపింది. ఆమె అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె గురించి డైరెక్టర్ కనగల జయకుమార్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సిల్క్ స్మిత అసలు సిసలైన పుష్ప అట!

తన అందం, అభినయంతో భారతీయ సినీ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది అలనాటి అందాల నటి సిల్క్ స్మిత. కేవలం ఐటెం సాంగ్స్, వ్యాంప్ పాత్రలతోనే స్టార్ హీరోలకు మించిన స్టార్డమ్‌ను సొంతం చేసుకున్న ఈ నటి అతి చిన్న వయసులో మరణించింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కనగల జయకుమార్ సిల్క్ స్మితకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సిల్క్ స్మిత కాలు మీద కాలు చేసుకుని స్టైల్‌గా కూర్చునేది. పెద్ద హీరోలు ఎవరు వచ్చిన సరే.. ఇది నా కాలే, ఇది కూడా కాలే.. నా కాలు మీద కాలు వేసుకుంటా అయితే ఏంటీ అన్నట్లు అలాగే కూర్చునేది. అప్పటి పుష్ప సిల్క్ స్మిత. నిజంగా పుష్పమే ఆ అమ్మాయి. ఆమె కళ్లు, ఫేస్‌లో ఉండే గ్లో.. ఫొటో గ్రఫిలో చూస్తే అసలు ఎంత అందంగా కనిపించేదో. ఆ అమ్మాయి కళ్లల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్‌కే పడిపోయారు అందరూ. పెద్ద నటి కాదు.. కానీ క్లోజప్‌లో తీస్తే చాలా అందంగా ఉండేది. కమల హాసన్‌తో తమిళంలో ఎన్ని సినిమాలు, ఎంత అద్భుతంగా తీసిందో’ అంటూ మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

ఆమె కళ్ళల్లో మ్యాజిక్ ఉంది: డైరెక్టర్

కమల్ తో సిల్క్ స్మిత సినిమాలు ఒక చరిత్ర

సిల్క్ స్మిత గురించి డైరెక్టర్ కనగల జయకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.