
అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. తొమ్మిది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇతర సినిమాలకు పోటీగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది.
Key Points
సితారే జమీన్ పర్ 9 రోజుల్లో ₹100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.
9వ రోజు ₹12.75 కోట్లు వసూలు చేసి, మొత్తం వసూళ్లు ₹108.30 కోట్లకు చేరుకుంది.
కన్నప్ప, మా సినిమాల మధ్యనూ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
9 రోజుల వసూళ్లు అద్భుతం
ఒకప్పుడు అమీర్ ఖాన్‌సినిమాలో తొలి రోజునే నలభై, యాభై కోట్లు వచ్చేవి, లాంగ్ రన్‌లో వందల కోట్లు వసూలు చేసేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
వంద కోట్లు రాబట్టడం పెద్ద గగనమైపోయింది బాలీవుడ్ కి. ఆయా చిత్రాలు వంద కోట్లు దాటితే గొప్పగా చూసే పరిస్థితి తలెత్తింది. పెద్ద పెద్ద సూపర్ స్టార్లకి కూడా ఇదే పరిస్థితి వచ్చింది.
అమీర్ ఖాన్ నటించిన `సితారే జమీన్ పర్` తొలి 8 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బాగా రాణించి, భారతదేశంలో ₹ 95.55 కోట్లు వసూలు చేసింది. 9వ రోజున ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.
ఈ చిత్రం శుక్రవారం, (జూన్ 27 ) బాక్సాఫీస్ వద్ద తన పట్టును కొనసాగించి, 6.65 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ లెక్కన ఇది 8 రోజుల్లో మొత్తం రూ. 95.55 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశం
`కన్నప్ప`, కాజోల్ `మా` సినిమాలు విడుదలైనప్పటికీ, `సితారే జమీన్ పర్` భారతదేశంలో టికెట్ కౌంటర్ల వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడ `సితారే జమీన్ పర్` 9వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు కూడా బాగున్నాయి.
`సితారే జమీన్ పర్` శనివారం, 28 జూన్, 2025న మొత్తం 32.27% హిందీ ఆక్యుపెన్సీని పొందింది. తొమ్మిదవ రోజు ఆక్యుపెన్సీ ఉదయం షో: 15.50%, మధ్యాహ్నం షో: 34.78%, సాయంత్రం షో: 46.54%గా ఉంది.
క్రమంగా పుంజుకోవడం విశేషం. అదే సమయంలో రెండో వారంలోనూ ఈ స్థాయి ఆక్యుపెన్సీ గొప్ప విషయమనే చెప్పాలి.
ఆక్యుపెన్సీ రేట్లు
సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ వసూళ్లు 9వ రోజు కొత్త రికార్డు సృష్టించింది! ఆమిర్ ఖాన్ స్పోర్ట్స్-కామెడీ చిత్రం అధికారికంగా రూ.100 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించింది.
`సితారే జమీన్ పర్` విడుదలైన రెండవ శనివారం, 9వ రోజు ₹ 12.75 కోట్లు (ప్రారంభ అంచనా) వసూలు చేసింది. దీని మొత్తం వసూళ్లు ₹ 108.30 కోట్లకు చేరుకున్నాయి.
`సితారే జమీన్ పర్` 2018 స్పానిష్ చిత్రం ‘క్యాంపియన్స్’కి హిందీ రీమేక్. దీనికి విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చాయి. ఇప్పుడు వసూళ్లపరంగానూ మంచి ఆదరణ దక్కుతుంది. అమీర్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పుంజుకుంటున్నారని చెప్పొచ్చు.
అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత మళ్ళీ పుంజుకుంటున్నారు. సితారే జమీన్ పర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ విజయం ఆయన అభిమానులకు పెద్ద సంతోషాన్నిచ్చింది.


