
📌 Key Points
- శివాజీకి గద్దర్ అవార్డు: దండోర చిత్రంలోని నటనకు గాను లభించిన గౌరవం!
- దర్శకుడికే అవార్డు ఇవ్వాలన్న శివాజీ: తన కన్నా ఆయనే ఎక్కువ కష్టపడ్డాడని వెల్లడి!
- దండోర విడుదల అడ్డంకులు: సెన్సార్ ఆలస్యం, థియేటర్ల సమస్యలు!
- టైటిల్ కూడా కారణమన్న శివాజీ: సినిమా ఫెయిల్యూర్ కు టైటిల్ కూడా ఒక కారణమన్న శివాజీ!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. గద్దర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
గద్దర్ అవార్డుకు శివాజీ ఎంపిక!
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ పోయిన సంవత్సరం దండోరా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో నవదీప్, నందు, బిందు మాధవి ముఖ్య పాత్రల్లో నటించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు జనాల్లో ఏర్పడ్డాయి.
దర్శకుడికే అవార్డు అంటున్న శివాజీ!
అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా 2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఈ సినిమాలోని శివాజీ నటనకు గద్దర్ అవార్డు దక్కింది. తాజాగా గద్దర్ అవార్డు దక్కడంతో ఆయన దీనిపై స్పందిస్తూ “ఈ చిత్రంలోని నా నటనకు గద్దర్ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా కోసం నాకన్నా దర్శకుడు చాలా ఎక్కువ కష్టపడ్డాడు, నా అవార్డు అతనికి ఇస్తే నేను ఇంకా సంతోషిస్తాను” అని ఆయన చెప్పుకొచ్చాడు.
దండోర వెనుక అసలు నిజాలు!
తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా దండోరా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడానికి శివాజీ కొన్ని కారణాలను తెలియజేశాడు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కాగా 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సెన్సార్ కాలేదు, దానితో థియేటర్లు ఎవరూ ఇవ్వలేదు. ఈ సినిమా టైటిల్ కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ కావడానికి ఒక కారణం అని ఆయన చెప్పుకొచ్చాడు.
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన నిజాయితీని అందరూ మెచ్చుకుంటున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


