
కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘మదరాసి’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయన అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
శివ కార్తికేయన్ 'మదరాసి' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో డ్యాన్స్ తో అలరించారు.
'మదరాసి' చిత్రంలోని 'సలంబల' పాటకు ఆయన స్టెప్పులు వైరల్ అయ్యాయి.
సెప్టెంబరు 5న 'మదరాసి' చిత్రం విడుదల కానుంది.
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్.
‘మదరాసి’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘మదరాసి’ ( Madharaasi ) . ఈ మూవీని మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ కనిపించనుది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది . ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది .
వైరల్ అయిన డ్యాన్స్ వీడియో
ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మదరాసి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు శివ కార్తికేయన్ . తాజాగా బెంగళూరులో మదరాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు . ఈ సందర్భంగా వేదికపైనే డ్యాన్స్ తో అలరించాడు హీరో శివ కార్తికేయన్ . ఈ చిత్రంలోని సలంబల అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
చిత్ర విడుదల తేదీ
కాగా .. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫుల్ హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు . ట్రైలర్ చూస్తేనే సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
శివ కార్తికేయన్ అభిమానులకు ‘మదరాసి’ చిత్రం పెద్ద సర్‌ప్రైజ్. ఆయన డ్యాన్స్ వీడియో వైరల్ అవడం చిత్రంపై ఆసక్తిని పెంచింది. సెప్టెంబరు 5న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.


