|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీ ఫోన్ వేడెక్కుతోందా? ప్రాణాలకే ప్రమాదం! బ్యాటరీ పేలుడుకు చెక్ పెట్టే రహస్యాలు ఇవే!

Published: 06-06-2026, 5:16 PM
మీ ఫోన్ వేడెక్కుతోందా? ప్రాణాలకే ప్రమాదం! బ్యాటరీ పేలుడుకు చెక్ పెట్టే రహస్యాలు ఇవే!
  • సూర్యరశ్మికి, కారులో నేరుగా ఫోన్‌ను ఉంచడం మానుకోండి.
  • మంచంపై, దిండుపై ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది, టేబుల్‌పై ఛార్జ్ చేయండి.
  • ఛార్జింగ్ సమయంలో ఫోన్ కేస్‌ను తీసివేయడం వల్ల బ్యాటరీ హీట్ అవ్వదు.
  • ఫాస్ట్ ఛార్జింగ్, హై బ్రైట్‌నెస్ వాడకాన్ని తగ్గించడం ద్వారా వేడిని నియంత్రించవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ తరచుగా వేడెక్కుతోందా? వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అధిక వేడి బ్యాటరీకి ప్రమాదకరం, పేలుడుకు దారితీయవచ్చు. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఈ కథనంలో ఉన్నాయి.

ఫోన్‌ను వేడి నుండి రక్షించుకోండి

Smartphone Overheating : మీ స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా? తస్మాత్ జాగ్రత్త.. అందులోనూ మండుటెండలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ గా వేడుక్కుతుంది. ఇలాంటి పరిస్థితులలో స్మార్ట్‌ఫోన్‌లు వేగంగా హీట్ అవుతుంటాయి.

ఈ అధిక వేడి కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ దెబ్బతినడం లేదా పేలిపోయే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ హీట్ నుంచి బ్యాటరీ, స్మార్ట్‌ఫోన్ హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కింది టిప్స్ ద్వారా తెలుసుకుందాం..

మీ ఫోన్‌ను సూర్యరశ్మిలో ఉంచొద్దు : మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా సూర్యరశ్మి తగిలేలా పెట్టొద్దు. దాంతో మీ ఫోన్, బ్యాటరీ (Smartphone Overheating) త్వరగా వేడెక్కి, బ్యాటరీ పాడవుతుంది. లేదంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

కారులో తప్పక గుర్తుంచుకోండి : కారులో మీ ఫోన్‌ను వాడుతుంటే.. డాష్‌బోర్డ్‌పై పెట్టవద్దు. అలాగే వదిలివేయవద్దు. కారులో ఈ చోటు నేరుగా ఎండ తగులుతుంది. దాంతో మీ ఫోన్ త్వరగా వేడెక్కుతుంది.

మీ ఫోన్‌ నీడలో ఉన్నా క్లోజ్ చేసిన కారులో టెంపరేచర్ వేగంగా పెరుగుతాయి. అందుకే ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. మీ ఫోన్‌ను ఎక్కువ సేపు వేడిగా ఉండే కారులో అలా వదిలేయొద్దు.

ఛార్జింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఛార్జింగ్ సమయంలో ఈ పొరపాట్లు చేయొద్దు :

మంచం,దిండుపై ఛార్జింగ్ చేయద్దు : మీ ఫోన్‌ను మంచం పరుపు, దిండు లేదా ఇతర సర్ఫేస్ ఉంచి ఎప్పుడూ ఛార్జ్ చేయొద్దు. తద్వారా మీ ఫోన్ త్వరగా వేడెక్కవచ్చు. మీ ఫోన్‌ను టేబుల్ లేదా క్లీన్ ఎయిర్ తగిలే చోట వేడెక్కని ప్రాంతంలో మాత్రమే ఉంచండి.

Read Also : OnePlus Ace 7 : కెమెరా కేక, 10,000mAh బ్యాటరీ మాస్! కొత్త వన్‌ప్లస్ ఫోన్ మార్కెట్‌ని షేక్ చేయబోతోంది!

కేస్‌ను రిమూవ్ చేయండి : మీ ఫోన్ అతిగా వేడెక్కుతుందా? ఛార్జింగ్ సమయంలో ఇంకా వేడెక్కకుండా ఉండేందుకు బ్యాక్ కవర్ లేదా కేస్‌ తీసివేయండి. కేస్‌తో ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ రెండు రెట్లు వేగంగా హీట్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్ ద్వారా వేడిని తగ్గించడం

ఫాస్ట్ ఛార్జింగ్‌ వద్దు : మీ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందా? హీట్ ఉన్నప్పుడు ఎక్కువ సేపు వాడొద్దు. ఎందుకంటే మీ ఫోన్‌కు ఫాస్ట్ పవర్‌ను అందిస్తుంది. తద్వారా బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వొచ్చు. మీ ఫోన్‌ సాధారణ 10W లేదా 15W ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే సరిపోతుంది.

సాఫ్ట్‌వేర్ ట్రిక్స్ : బ్రైట్‌నెస్‌ తగ్గించండి : మీ ఫోన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే వెంటనేతగ్గించండి. హై బ్రైట్‌నెస్ వల్ల డిస్‌ప్లే త్వరగా వేడెక్కుతుంది.

హెవీ యాప్స్‌ను క్లోజ్ చేయండి : మీ ఫోన్‌లో గేమ్స్ లేదా ఏదైనా హెవీ యాప్స్ యాక్టివ్‌గా ఉన్నాయా? వెంటనే టెంపరరీగా క్లోజ్ చేయండి. హెవీ యాప్స్ ఫోన్ టెంపరేచర్ త్వరగా పెంచుతాయి. కొన్నిసార్లు కెమెరాను వాడటం లేదా వీడియో స్ట్రీమింగ్ కారణంగా కూడా ఫోన్ ఓవర్ హీట్ కారణం కావచ్చు.

ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ ఫోన్ ఓవర్ హీట్ కాకుండా నివారించవచ్చు. అలాగే, బ్యాటరీ టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

స్మార్ట్‌ఫోన్ ఓవర్‌హీటింగ్ అనేది చిన్న సమస్య కాదు, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. పైన చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా మీ ఫోన్‌ను, మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.