|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది.. అతడితో ఉన్న క్షణాల గురించి సోనమ్ బాజ్వా పోస్ట్..

Published: 14-06-2025, 8:15 AM
ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది.. అతడితో ఉన్న క్షణాల గురించి సోనమ్ బాజ్వా పోస్ట్..

పంజాబీ నటి సోనమ్ బాజ్వా ‘ఏక్ దివానే కి దీవానియత్’ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసింది. హర్షవర్ధన్ రాణేతో కలిసి నటించిన ఈ చిత్రం అనుభవం గురించి ఆమె తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Key Points

1

సోనమ్ బాజ్వా ‘ఏక్ దివానే కి దీవానియత్’ చిత్రీకరణ పూర్తి చేసింది.

2

ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణేతో కలిసి నటించింది.

4

సోనమ్ బాలీవుడ్‌లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది.

సోనమ్ బాజ్వా యొక్క తాజా పోస్ట్

పంజాబీ నటి సోనమ్ బాజ్వా(Sonam Bajwa) ‘షాదీ, సింగం, క్వారీ ఆన్ జట్టా-3 వంటి సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే పలు చిత్రాల్లో గెస్ట్ రోల్‌లోనూ నటించిన సోనమ్.. అభిమానులను పెంచుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘హౌస్‌ఫుల్-5’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సోనమ్ ‘ఏక్ దివానే కే దీవానియాత్’(Ek Deewane ki DEEWANIYAT) సినిమాలో నటిస్తోంది. అయితే ఇందులో హర్షవర్ధన్ రాణే (Harshavardhan Rane)సరసన ఈ భామ రొమాన్స్ చేయనుంది. అన్ని అంశాలతో కలిగిన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాకు మిలాప్ జవేరి(Milap Zaveri) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, సోనమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

‘ఏక్ దివానే కి దీవానియత్’ చిత్రీకరణ పూర్తి

‘‘’ఏక్ దీవానే కి దీవానియత్’ చిత్రీకరణ పూర్తయిందని నేను రాస్తున్నానని నమ్మలేకపోతున్నాను. ఇప్పటివరకు నేను చిత్రీకరించిన అత్యంత కష్టతరమైన చిత్రాలలో ఇది ఒకటి అయినప్పటికీ, ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, దీవానియత్ బృందానికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. మీరందరూ లేకుండా ఇది సాధ్యం కాలేదు’’ అని రాసుకొచ్చింది. అలాగే షూటింగ్ సమయంలో హీరోతో పాటు పలువురితో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం సోనమ్ బాలీవుడ్‌లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. టైగర్ ష్రాఫ్ సరసన ‘బాఘి-4’ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు బోల్డ్ ఫొటోలతో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది.

బాలీవుడ్‌లో సోనమ్ యొక్క వృత్తి జీవితం

A post shared by Sonam Bajwa (@sonambajwa)

చిత్రీకరణ అనుభవం గురించి సోనమ్ బాజ్వా సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్‌లో ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తుండటం ఆమె విజయానికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.