
లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ సోనం వాంగ్‌చుక్ దీర్ఘకాల నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా ప్రజల్లో అపూర్వ చైతన్యం నింపింది. అహింసా మార్గంలో జాతి ఆత్మను జాగృతం చేసిన ఆయన త్యాగం, దాని ప్రభావంపై ఈ కథనం విశ్లేషిస్తుంది. ఆయన పోరాటం ఒక అసాధ్యమైన విజయాన్ని సాధించింది.
Key Points
ప్రొఫెసర్ సోనం వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చైతన్యం కలిగించింది.
ఆయన త్యాగం జాతి ఆత్మను అహింసా మార్గంలో జాగృతం చేసి, అసాధ్యమైన విజయాన్ని సాధించింది.
ఉపవాసం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను ఆర్టికల్ వివరిస్తుంది.
ఐరోమ్ షర్మిలా పోరాటాన్ని ప్రస్తావిస్తూ, ప్రజల అనుమానాలు, అవమానాల గురించి చర్చించింది.
సోనం వాంగ్‌చుక్ త్యాగం: దేశవ్యాప్త ప్రభావం
ప్రజా ఉద్యమాల్లో వ్యక్తుల పాత్ర ఎంత గొప్పదైనా, ఉద్యమం ఒక్కరి భుజాలపై నిలవదు. లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ సోనం వాంగ్‌చుక్ దీర్ఘకాల నిరాహార దీక్షతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించారు.. ఆయన ఇప్పటి వరకూ చేయలేకపోయిన దానిని చేశారు..
26 రోజుల ఉపవాసం అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ చేయలేరు.. దానికోసం ఆయన ఎటువంటి శ్రమలను అనుభవించారో మనమంతా చూసాం. ఆయన గొప్ప త్యాగం చేశారు. మానసికంగా, శారీరకంగా ఎంతో నొప్పిని భరించారు.
నిజాయితీపరులు కూడా శోధనను ఎదుర్కొంటారు. అనుమానాల్ని, అవమానాల్ని ఎదుర్కొంటారు. మానవ స్వభావం అటువంటిది. ఏ ప్రజల కోసమైతే ఎవరైనా జీవితమంతా గడిపారో, త్యాగాలు చేసారో ఆ ప్రజలే వారిని అనుమానిస్తే హృదయం బద్దలైతుంది. వాంగ్ చుక్ పరిస్థితి ఇప్పుడు అదే.. మణిపూర్ ‘ఐరన్ లేడీ’ ఐరోమ్ షర్మిలా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) రద్దుకై 16 సంవత్సరాలు (2000 నుండి 2016 వరకు) సుదీర్ఘ ఉపవాస దీక్ష చేశాక ఫలితం రాకపోవడంతో, మార్గం మార్చుకుని రాజకీయంగా పోరాడుదామని నిర్ణయించుకొని ఉపవాస దీక్షను విరమించినప్పుడు ఆమెను ప్రజలు ఘోరంగా అనుమానించి, అవమానించి బాధపెట్టారు. సోనం వాంగ్ చుక్ మహాత్ముడో కాదో కాలం నిర్ణయిస్తుంది. నా వరకు గాంధీ తర్వాత అంతటి స్థాయిలో జాతి ఆత్మను అహింసామార్గంలో జాగృతం చేసిన మహానీయుడు.
నిరాహార దీక్ష: శారీరక, మానసిక సవాళ్లు
నా వరకు ఇప్పటికే మన దేశానికి ఆయన చేసిన సేవలు చాలు ఆయన మహాత్ముడని చెప్పడానికి.. ఒక అసాధ్యమైన విజయాన్ని ఆయన సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎవరూ సాధించలేకపోయినది ఆయన సాధించారు. జాతి ఆత్మని జాగృత పరిచారు. ఐదారేళ్ల పిల్లలు కూడా ఇప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్నారు. కులమతాలకు అతీతంగా మొదటిసారి జాతి ఏకమైంది.
26 రోజుల ఉపవాసం అంటే ఏంటో తెలుసా? కరిగి పోయిన కండరాలు ఇక తిరిగి రావు, మెదడులో మరణించిన కణాలు ఇక తిరిగి రావు, నరాలలో జరిగిన విచ్ఛిన్నతను పునరుద్ధరించలేం. అలాగే అవయవాల్లో ఏదైనా విచ్ఛిన్నత జరిగితే అది కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. ఒక రకమైన వైకల్యం శాశ్వతంగా చనిపోయే వరకు ఉండిపోతుంది. మాన సిక బ్రాంతులు, హార్మోన్ల అసమతుల్యత వల్ల మానసిక సంతు లనం దెబ్బ తినడం జరుగుతుంది. ఎన్నిటినో తట్టుకోవాలి. కేసీఆర్ ఉపవాస దీక్ష సమయంలో 6 రోజుల తరువాత ఇక ఆపేస్తానని ఏడవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. సోనం వాంగ్ చుక్‌ని బలవంతంగా నిర్బంధించారు. ఫోన్ తీసేసుకున్నారు. బయటి వారితో సంబంధాలు తెంచి వేశారు. బయటి వార్తలు అందకుండా చేశారు. పులి బోనులో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారని ఎవరికీ నమ్మకం లేదు.. అటువంటి స్థితిలో ఉన్న ఆయనను జడ్జి చేయడం న్యాయం కాదు. ఆ నిర్బంధం నుండి ఆయన ముందు బయట పడడం ముఖ్యం. అటువంటి దార్శనికుడు జీవించి ఉండడం, ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం.
పోరాటాలు ప్రజలు కొనసాగించాలి. ఆయన ఒక దారి చూపించారు. భారం అంతా ఆయనే మోయాలని కోరడం తప్పు.. ఎవరూ ఇప్పటి వరకూ చేయలేకపోయిన దానిని ఆయన చేశారు. దానికోసం ఆయన ఎటువంటి శ్రమలను అనుభవించారో మనమంతా చూసాం. ఆయన గొప్ప త్యాగం చేశారు. మానసికంగా, శారీరకంగా ఎంతో నొప్పిని భరించారు. 10, 15 రోజుల వరకూ పర్వాలేదు. 26 రోజుల ఉపవాసం అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ చేయలేరు.. ప్రజల కోసం మాత్రమే చేయగలరు. అది దేహాన్ని, ఆరోగ్యాన్ని శాశ్వతంగా నాశనం చేసుకోవడం. సగం మరణించడం.
ఐరోమ్ షర్మిలాతో పోలిక: ఉద్యమ స్ఫూర్తి
60 ఏళ్ల వయసులో దేశ ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాన్ని గౌరవిద్దాం. ఆయనపై చాలామందికి సందేహాలు ఉండవచ్చు, వాటిని మనసులో ఉండనీయండి. జడ్జ్ చేయకండి. సందేహించడం, ప్రశ్నించడం తప్పేమీ కాదు. కానీ జడ్జ్ చేయడానికి తొందరపడకండి. ఆయన పని తీరును, నిస్వార్ధతను నిష్పక్షపాతంగా లేకుండా పరిశీలించండి. ఆయన నిజాయితీ ఇప్పటికే నిరూపితమైందని భావిస్తున్నాను. ఆయన లేకుండా జెన్ జి ఉద్యమాన్ని అభిజిత్ దీప్కే ఈ స్థాయికి తీసుకెళ్ళగలిగేవాడు కాడు. ఆయన త్యాగం జాతి జాగృతిని రగిలించింది. అభిజిత్ దీప్తి ప్రారంభించిన సీజేపీ పోరాటానికి ప్రొఫెసర్ సోనం వాంగ్ చుక్ ఒక తార్కిక రూపం ఇచ్చి ఉత్కృష్ట దశకు చేర్చారు.. అందుకే ఈ ఉద్యమం ఎన్నో కష్టాలు ఎదురైనా ఈ మాత్రం సక్సెస్ అయ్యింది. అది కూడా ఇటువంటి పాలకుల ముందు.
సోనం వాంగ్ చుక్ చేసింది ఒక మహాత్యాగం. ఆయనను ఆత్మబలిదానం కోరకండి. ఆయనను అమరవీరుడిగా చూడాలనుకోకండి. ఆయనను దేశాన్ని నడిపించే ఒక నాయకుడిగా చూడడానికి ఇష్టపడండి. ఆయన గొప్ప నాయకుడు అవుతాడని నాకు నమ్మకం కలిగింది. మీరు ఒక ఛాయ్ వాలాకు అవకాశం ఇచ్చారు.. ఇప్పుడు ఒక అహింసావాదికి, మానవతావాదికి, జాతి కోసం ఎంతో సేవ చేసిన ఒక మేధావికి, దార్శనికుడికి కూడా అవకాశం ఇచ్చి చూడండి. భారత ప్రజలు ఎప్పటికీ సోనం వాంగ్ చుక్‌కి రుణపడి ఉంటారు.. ఎందుకంటే ఆయన వారికి ఏమి చేసినా ప్రేమతోనే చేశారు, నిస్వార్ధంగా.
సోనం వాంగ్‌చుక్ త్యాగం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, అది జాతిని ఏకం చేసి, అహింసా మార్గంలో మార్పుకు స్ఫూర్తినిచ్చింది. ఆయన చేసిన సేవలు, చూపిన ధైర్యం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.



Ananta Sriram’s Viral Warning to Reviewers: ‘Ayinollaki Akullo’ Remarks Spark Debate