
తాజాగా, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దక్షిణాది సూపర్ స్టార్లతో ఒక ఫన్నీ వీడియో సృష్టించబడింది. ఈ వీడియోలో సూర్య, అజిత్, అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్స్ కనిపిస్తున్నారు.
Key Points
ఏఐ సాయంతో సృష్టించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాది సూపర్ స్టార్స్ సూర్య, అజిత్, అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్, రామ్ చరణ్ ఈ వీడియోలో కనిపించారు.
హీరోలు హీరోయిన్లకు ఆహారం తినిపిస్తున్న ఫన్నీ సన్నివేశాలు వీడియోలో ఉన్నాయి.
ఈ వీడియో ఫ్యాన్స్‌ను బాగా నవ్విస్తోంది.
ఏఐ టెక్నాలజీ మాయాజాలం
ఏఐ ( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు . సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు . ముఖ్యంగా సినీ , రాజకీయ ప్రముఖుల ఫోటోలు , వీడియోల కంటెంట్ ను ఎక్కువగా సృష్టిస్తున్నారు . ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్ చల్ చేశాయి . ఈ వీడియో ఫ్యాన్స్ కు తెగ నవ్వులు తెప్పించింది .
తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్ తో రూపొందించారు . హీరోలు సూర్య , అజిత్ , బన్నీ , మహేశ్ బాబు , విజయ్ , రామ్ చరణ్ తో కలిసి ఫన్నీగా రూపొందించారు . ఇందులో హీరోలంతా హీరోయిన్స్ కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు . ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది . తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు . ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి .
సూపర్ స్టార్స్ ఫన్నీ వీడియో
సోషల్ మీడియాలో వైరల్
ఏఐ సాంకేతికతతో సృష్టించిన ఈ వీడియో సోషల్ మీడియాలో అలజడి సృష్టించింది. నవ్వులు పంచుకునే ఈ వీడియోను మీరు కూడా ఆస్వాదించండి.


