
ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రకు ఎంపికైంది. ఆమె పాత్రపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, ఈ ప్రాజెక్ట్ నవంబర్ 5న షూటింగ్ ప్రారంభించనుంది.
Key Points
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా షూటింగ్ నవంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు.
మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ 'స్పిరిట్'లో కీలక పాత్రకు ఎంపికైంది.
చిరంజీవి అతిథి పాత్రలో, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది.
ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ వివరాలు
ప్రభాస్.. ఇప్పుడు ‘రాజాసాబ్’, ఫౌజీ చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వీటితో పాటు లైన్‌లో చాలానే సినిమాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా తీయాల్సిన ‘స్పిరిట్’ లిస్టులో ముందు వరసలో ఉంది. లెక్క ప్రకారం సెప్టెంబరులోనే షూటింగ్ మొదలవుతుందని చాన్నాళ్ల క్రితం సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ ఇప్పటికే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు షూటింగ్‌తో పాటు మరో అప్‌డేట్ వినిపిస్తుంది.
‘యానిమల్’ తర్వాత సందీప్ వంగా చేస్తున్న సినిమా ‘స్పిరిట్’. చాన్నాళ్ల క్రితమే ప్రకటన వచ్చింది గానీ ప్రభాస్ మూవీస్ లైనప్ వల్ల ఆలస్యమవుతోంది. ఫైనల్‌గా నవంబర్ 5వ తేదీ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని ఫిక్సయ్యారట. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అయితే ప్రభాస్ తండ్రిగా అతిథి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే టాక్ కాస్త గట్టిగానే వైరల్ అవుతోంది. సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.
మడోన్నా సెబాస్టియన్: ఒక పరిచయం
ఇకపోతే హీరోయిన్‌గా తొలుత దీపిక పదుకొణెని అనుకున్నారు. కానీ పెట్టిన కండీషన్స్ నచ్చక సందీప్ ఆమెని ప్రాజెక్ట్ నుంచి తొలిగించాడనే కొన్నాళ్ల క్రితం వార్తల వచ్చాయి. దీపిక ప్లేసులో తృప్తి దిమ్రి వచ్చింది. ఇప్పుడు మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కూడా ‘స్పిరిట్’లో భాగమైందట. తొలుత ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ని తీసుకున్నారట. ఇప్పుడు ఈమె స్థానంలోనే మడోన్నాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమెది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరా? లేదంటే ప్రతినాయక పాత్ర అనేది తెలియాల్సి ఉంది.
మడోన్నా సెబాస్టియన్ విషయానికొస్తే.. మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. తెలుగులో ‘ప్రేమమ్’ రీమేక్‌లో నాగచైతన్య సరసన నటించింది. తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చేసింది. ఇన్నాళ్లకు ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈమెకు అదృష్టం కలిసొచ్చినట్లే!
స్పిరిట్ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు
మొత్తానికి, ‘స్పిరిట్’ సినిమాలో మడోన్నా సెబాస్టియన్ ఎంట్రీ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఆమెది రెండో హీరోయిన్ పాత్రనా లేక ప్రతినాయక పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ పక్కన ఆమె కెరీర్‌కు ఇదొక పెద్ద బ్రేక్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


