|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాపులర్ ఓటీటీ సిరీస్‍కు మూడో సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరింత డెడ్లీగా!

Published: 06-05-2025, 8:36 AM
పాపులర్ ఓటీటీ సిరీస్‍కు మూడో సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరింత డెడ్లీగా!

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సీజన్ టీజర్ ఇప్పటికే విడుదలైంది. జూన్ 27వ తేదీన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Key Points

1

స్క్విడ్ గేమ్ సీజన్ 3 టీజర్ విడుదలైంది!

2

జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం.

4

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

స్క్విడ్ గేమ్ 3 టీజర్ విశ్లేషణ

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ చాలా పాపులర్. ఇండియాలోనూ ఈ సిరీస్‍కు చాలా ఆదరణ దక్కింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. 2021లో వచ్చిన తొలి సీజన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూడేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్‌లో రెండో సీజన్ వచ్చింది. ఇప్పుడు స్క్విడ్ గేమ్ మూడో సీజన్ అప్పుడే రెడీ అయింది. నేడు (మే 6) సీజన్ 3 టీజర్ వచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

స్క్విడ్ గేమ్ 2 ముగిసిన దగ్గరి నుంచే ఈ మూడో సీజన్ షురూ కానుంది. పింక్ డ్రెస్ వేసుకున్న గార్డులు ఓ శవపేటికను మోసుకురావటంతో స్క్విడ్ గేమ్ 3 టీజర్ మొదలైంది. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లలో భయం చూసేందుకు వారు ఇలా శవ పేటికను తీసుకొస్తారు. ఇతర ప్లేయర్లు దగ్గరికి వచ్చి చూస్తారు. కానీ అందులో వారు ఊహించని విధంగా అందులో షియాంగ్ జీ హున్ (లీ జంగ్ జీ) ఉంటాడు. ఇది పెద్ద ట్విస్టుగా ఉంటుంది.

స్ట్రీమింగ్ తేదీ ఖరారు

ప్రైజ్‍మనీ కోసం మిగిలిన కంటెస్టెంట్లు ఈ డెడ్లీ గేమ్‍లో పోటీ పోటీ పడడం మళ్లీ మొదలవుతుంది. ఈ గేమ్ నిర్వాహకుల గుట్టు రట్టు చేసేందుకు షియాంగ్ ప్రయత్నిస్తుంటాడు. వన్ లాస్ట్ టైమ్ అని ఈ టీజర్లో ఉంది. ఈ సీజన్ మరింత డెడ్లీగా, వైలెంట్‍‍గా ఉంటుందని అర్థమవుతోంది. ఓ శిశువు ఏడుపు శబ్దంతో స్క్విడ్ గేమ్ సీజన్ 3 టీజర్ ముగిసింది. స్క్విడ్ గేమ్‍లో ఇది ఆఖరి సీజన్ అనే హింట్ కూడా వచ్చేసింది.

స్క్విడ్ గేమ్ సీజన్ 3.. ఈ ఏడాది జూన్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్‍తో పాటు తమిళం, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. డేట్‍ను కూడా అధికారికంగా ఖరారు చేసింది నెట్‍ఫ్లిక్స్.

కథానకం మరియు నటీనటులు

రెండో సీజన్ ముగింపులో మిగిలిన ప్లేయర్లతో ఆటతో స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఉండనుంది. షియాంగ్ జీ హున్, డిటెక్టివ్ హువాంగ్ జున్ హో, జియో హో, హ్యున్ డూ, యంగ్ సీ కూడా ఇందులో ఉన్నారు. ఈ సీజన్ మరింత ఇంటెన్సీతో ఉండనుంది. “ఫైనల్ గేమ్స్ ఆడేందుకు సమయం వచ్చేసింది. జూన్ 27న స్క్విడ్ గేమ్ సీజన్ 3” అని సోషల్ మీడియాలో నెట్‍ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍కు క్రియేటర్, డైరెక్టర్‌గా హ్యాంగ్ డాంగ్ హ్యుక్ ఉన్నారు. లీ జంగ్ జీ, పార్క్ హీ సూ, వీ హా జూన్, జంగ్ హూ యెవోన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన స్క్విడ్ గేమ్ మూడో సీజన్ జూన్ 27న విడుదల అవుతోంది. మరింత ఉత్కంఠ, హింసతో కూడిన ఈ సీజన్ ప్రేక్షకులను అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.