|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీ విష్ణు సినిమాల విడుదల వెనుక అసలు సమస్యలు ఇవేనా? సంచలన విషయాలు!

Published: 26-02-2026, 12:05 PM
  • ఫిబ్రవరి 27న ‘విష్ణు విన్యాసం’ విడుదల కానుంది.
  • మార్చి 6న ‘మృత్యుంజయ్’ చిత్రం విడుదల కాబోతోంది.
  • రెండు సినిమాల విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు శ్రీ విష్ణు తెలిపారు.
  • దర్శకుడు మారుతి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ ప్రారంభించామన్న శ్రీ విష్ణు.

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. అయితే ఆయన నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా, ఆ సమయంలో ఎదురైన సమస్యలను శ్రీ విష్ణు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

శ్రీ విష్ణు రెండు సినిమాల విడుదల

Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా నటించిన హిలేరియస్ జాయ్‌రైడ్‌ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు సరసన నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్.. ఇప్పటికే హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీవిష్ణు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సి ఉండగా, రెండు సినిమాలకు మధ్య ఒక వారం వ్యవధి ఉండాలని నిర్మాతలు అడ్జస్ట్ చేసుకోవడంతో.. ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 27 వస్తుండగా, మార్చి 6వ తేదీన ‘మృత్యుంజయ్’ చిత్రం విడుదల కాబోతోంది. అయితే రెండు సినిమాల విడుదల విషయంలో చాలా సమస్యలు ఫేస్ చేసినట్లుగా శ్రీవిష్ణు (Sree Vishnu) తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమస్యలు ఏమై ఉంటాయా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ..

సమస్యలు ఎదుర్కొన్న శ్రీ విష్ణు

‘‘ఈ సినిమాలో గ్రహాలని, జాతకాలను నమ్ముతాను కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం అన్నీ ఫాలో అవ్వను. కానీ, చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని మాత్రం ఫాలో అవుతాను. పర్సనల్‌గా నాకైతే టైము, నెంబర్లు అనే నమ్మకాలు లేవు. డైరెక్టర్ మారుతి కథ చెప్పగానే, నాకు చాలా నచ్చింది. అందరూ రిలేట్ అయ్యే కథ, చాలా మంచి పాత్ర ఇది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. కథ విన్న వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. ఇలాంటి పాత్ర చేయడం నాకు కొత్త. ఈ క్యారెక్టర్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా నమ్మకాలని ఫాలో అవుతుంటాడు. నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ యూత్‌కి, సెకండ్ హాఫ్ యూత్‌తో పాటు ఫ్యామిలీకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ కామెడీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

సినిమా విశేషాలు పంచుకున్న హీరో

ఇక రెండు సినిమాలు ఒకేసారి అనేది కొంచెం సున్నితమైన అంశం. ఎలా బ్యాలెన్స్ చేయాలా? అనేదానిపై నేను కూడా ఒక రెండు మూడు రోజులు స్ట్రగుల్ అయ్యాను. రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఓటీటీ ఒక కారణం అయితే, ఇంకో కారణం కూడా ఉంది. అది ఇప్పుడే చెప్పకూడదు. సినిమాల రిలీజ్ తర్వాత సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. అది ముందే చెప్తే పబ్లిసిటీ స్టంట్ అనుకునే అవకాశం కూడా ఉంది. ఓటీటీ డీల్స్ ఈ రెండు సినిమాలకే కాదు, నేను చేస్తున్న మరో మూడు సినిమాల డీల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. రిలీజ్‌‌కు ముందే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండడం చాలా ఆనందాన్నిస్తుంది. నేనెప్పుడూ కూడా ప్రొడ్యూసర్స్ పెట్టే డబ్బులు వెనక్కి వస్తే చాలు అనే ఆలోచనతోనే ఉంటాను. ఇప్పుడు అలా అన్ని సినిమాలు జరగడం హ్యాపీగా ఉంది..’’ అని తెలిపారు.

శ్రీ విష్ణు రెండు సినిమాలు విడుదల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.