
📌 Key Points
- శ్రీలీల ఒక డజనుకు పైగా సినిమాలు చేసినా ఆశించిన సక్సెస్ రాలేదు.
- సినిమాలతో పాటు ఎంబిబిఎస్ పూర్తి చేయడం చాలా కష్టమని శ్రీలీల అన్నారు.
- ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతూ డాక్టర్ కావాలనే కోరికను నెరవేర్చుకున్నానని శ్రీలీల తెలిపారు.
- శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడంతో ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తూనే ఎంబిబిఎస్ పూర్తి చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు పనులు ఒకేసారి చేయడం కష్టమని, పిచ్చెక్కిపోయేలా ఉండేదని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమాలు, చదువు ఒకేసారి చేయడం కష్టమా?
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు .ఈమె కెరియర్ లో ఇప్పటివరకు ఒక డజనుకు పైగా సినిమాలు చేసి ఉంటారు కానీ ఇందులో ఒకటి రెండు మినహా చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం లేవని చెప్పాలి. ఇలా ఒకవైపు వరుస డిజాస్టర్లు ఎదురవుతున్నప్పటికీ శ్రీలీలకు(Sreeleela) వరుస సినిమా అవకాశాలు రావడం గమనార్ధం. శ్రీలీల ఇప్పుడు తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ అలాగే తమిళంలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.
కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీలీల మరోవైపు తనకెతో ఇష్టమైన డాక్టర్ చదువుని కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె ఎంబిబిఎస్ డిగ్రీ కూడా అందుకున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల ఒకవైపు నటిగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు డాక్టర్ పట్టా అందుకోవడం కోసం పడిన కష్టం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమాలలో నటిస్తూ చదువుకోవడం అనేది అసాధ్యం కానీ శ్రీలీల మాత్రం ఏకంగా డాక్టర్ చదువుని పూర్తి చేశారు.
డాక్టర్ కావాలనేది నా చిన్ననాటి కల: శ్రీలీల
ఇలా రెండింటిని విజయవంతంగా పూర్తి చేయడం గురించి శ్రీలీల మాట్లాడుతూ.. మనం రెండు పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు మన మనసుని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలని తెలిపారు. షూటింగ్లో ఉండి ఇంటికొచ్చిన తర్వాత మళ్లీ చదవాలి అంటే ఎంతో ఒత్తిడిగా అనిపించేదని, ఆ సమయంలో నాకు పిచ్చెక్కిపోతుందేమో అనే భావన కలిగి ఉండేదని శ్రీలీల తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత డాక్టర్ చదువు ఎందుకు అనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురైది. ఈ ప్రశ్నకు శ్రీ లీల సమాధానం చెబుతూ..
కాళీ దొరికితే పుస్తకం చేతిలో ఉంటుంది..
సినిమాలతో పాటు డాక్టర్ వృత్తిలో శ్రీలీల!
తనకు డాక్టర్ కావాలి అనేది చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన కోరిక తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. నేను డాక్టర్ గా ఉండటాన్ని ఇష్టపడతాను ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన పుస్తకాలను చేతిలో పట్టుకుంటానని షూటింగ్ లొకేషన్లో కాళీ దొరికిన కూడా తాను చదువుకునేదాన్ని అంటూ శ్రీలీల మెడిసిన్ పూర్తి చేయడం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె డాక్టర్ చదువును పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక శ్రీ లీల తల్లి కూడా డాక్టర్ కావడంతో ఇప్పటికే వీళ్ళు హాస్పిటల్స్ కూడా రన్ చేస్తున్నారు. భవిష్యత్తులో శ్రీలీల కూడా తన వైద్య వృత్తిలో స్థిరపడతారని చెప్పాలి.
శ్రీలీల డాక్టర్ చదువును పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమె తల్లి కూడా వైద్యురాలు కావడంతో, వీరు త్వరలో హాస్పిటల్ ప్రారంభించే అవకాశం ఉంది.


