|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీలీల నిశ్చితార్థం..? ‘బిగ్‌ డే’ అంటూ ఫోటోలు విడుదల

Published: 30-05-2025, 11:13 PM

నటి శ్రీలీల తన సోషల్ మీడియాలో ‘బిగ్ డే’ అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఆమె నిశ్చితార్థానికి సంబంధించినవని కొందరు అనుమానిస్తుండగా, మరికొందరు ప్రమోషన్స్ అని అంటున్నారు. కార్తిక్ ఆర్యన్ తో ఆమె డేటింగ్ గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఫోటోలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Key Points

1

శ్రీలీల 'బిగ్ డే' ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

2

నిశ్చితార్థం అని కొందరు అనుకుంటున్నారు, మరికొందరు ప్రమోషన్ అని అనుమానిస్తున్నారు.

4

కార్తిక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి.

శ్రీలీల సోషల్ మీడియా పోస్ట్

ఫోటోలు షేర్‌ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు పూర్తిగా ప్రకటించలేదు. త్వరలో చెబుతానని, తనకు ఈరోజు ‘బిగ్‌ డే’ అంటూ.. హింట్‌ ఇచ్చింది. అయితే, నెటిజన్ల నుంచి శ్రీలీల షేర్‌ చేసిన ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  శ్రీలీల నిశ్చతార్థం చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఆమె చేస్తున్న ప్రమోషన్స్‌ కావచ్చని అంటున్నారు. ఈ విషయంపై శ్రీలీల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

వరుడు అతనేనా..? బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan),  శ్రీలీల (Sreeleela) డేటింగ్‌లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అనురాగ్‌ బసు దర్శకత్వంలో వారిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారని టాక్‌ వచ్చింది. కార్తిక్‌ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వేడుకలో శ్రీలీల కనిపిస్తూ  ఉంటుంది. ఆపై కొద్దిరోజుల క్రితం  జరిగిన ‘ఐఫా’ (IFFA) వేడుకల్లో తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో చెబుతూ కార్తిక్‌ ఆర్యన్‌ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేము కోరుకుంటున్నాం’ అని ఆమె చెప్పారు. శ్రీలీల నటి మాత్రమే కాదు ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చదువుతుంది. ఈ ఏడాదితో ఆమె చదువు కూడా పూర్తి అవుతుంది. కార్తిక్‌ – శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ వైరల్‌ అవుతున్న సమయంలో  హీరో తల్లి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు శ్రీలీల షేర్‌ చేసిన ఫోటోలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి.

నిశ్చితార్థం వార్తలపై విభిన్న అభిప్రాయాలు

కార్తిక్ ఆర్యన్ – శ్రీలీల డేటింగ్ రూమర్స్

శ్రీలీల తన ‘బిగ్ డే’ గురించి స్పష్టత ఇవ్వడం ద్వారా ఈ అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది. ఇంతలో ఈ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.