
📌 Key Points
- శ్రీలీల, పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
- సినిమాలోని డైలాగ్‌తో ఉన్న టీ షర్టు ధరించి శ్రీలీల ప్రమోషన్ చేయడం ఆశ్చర్యపరిచింది.
- గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ కావడంతో అంచనాలు పెరిగాయి.
- సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా, అభిమానుల కోసం మార్చి 19నే విడుదల కానుంది.
యంగ్ బ్యూటీ శ్రీలీల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ఆమె వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో శ్రీలీల సందడి
Ustaad Bhagat Singh:యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela ) ఈ మధ్యకాలంలో వరుసగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ జోరు పెంచేసింది.. ముఖ్యంగా హరీష్ శంకర్( Harish Shankar)దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా హరీష్ శంకర్ మాత్రమే సింగల్ గా ప్రమోషన్స్ చేపడుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయనకు తోడుగా శ్రీ లీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే తాజాగా ఆమె వినూత్న పద్ధతిలో చేసిన ప్రమోషన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ , నెటిజన్స్ శ్రీ లీలా కష్టం మామూలుగా లేదే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల సినిమా నుండి విడుదలైన ట్రైలర్ లో వచ్చిన డైలాగు అందరి దృష్టిని ఆకట్టుకుంది. “ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం” అనే డైలాగు భారీగా పాపులర్ అయిపోయింది . ఇప్పుడు ఇదే డైలాగ్ ను “శ్రీలీల ఇచ్చిపడేసే గోత్రం ..ఇరగదీసే నక్షత్రం” అని రాసి ఉన్న టీ షర్టును ధరించి మరీ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వినూత్నంగా సినిమా ప్రమోషన్స్ చేపట్టింది. అయితే ఇది చూసిన నెటిజన్స మాత్రం సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శ్రీ లీల ఈ సినిమా సక్సెస్ అందుకోవడానికి ఈ విధంగా వినూత్న పద్ధతిలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. పాపం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత ప్రయత్నాలు చేస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టిన శ్రీ లీల ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
డైలాగ్ టీ షర్టుతో వినూత్నంగా ప్రమోషన్స్
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది . మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఒక భారీ అంచనాల మధ్య మార్చి 26న రావాల్సిన ఈ సినిమా అభిమానుల కోసం వారం ముందుగానే మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలే సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శ్రీ లీల.. టాలీవుడ్లో మళ్లీ పాగా వేయాలని చూస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా కి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది. అటు కోలీవుడ్లో అడుగుపెట్టినా అక్కడ కూడా సరైన సక్సెస్ లభించలేదు. పవన్ కళ్యాణ్ సినిమా నైనా శ్రీ లీలకి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల
A lineage of boundless generosity, a star of dazzling brilliance — Sreeleela is set to participate in the #UstaadBhagatSingh promotions!!..❤️🔥🔥🔥 #Sreeleela #UsthaadBhagatSingh #UBSOnMarch19th #AuraofUstaad #UBSTrailer #MythriMovieMakers #USB #Tollywood #entertainment #Bigtv … pic.twitter.com/ke5L1qLQS5
— BIG TV Cinema (@BigtvCinema) March 17, 2026
మొత్తానికి శ్రీలీల ఈ సినిమా కోసం చాలా కష్టపడుతోంది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


