
టాలీవుడ్ నటి శ్రీలీల తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంగా వోణిలో కనిపించిన ఆమె కుంకుమ పెట్టుకుని ఉన్న ఫోటోతో ఎంగేజ్‌మెంట్ వార్తలు వస్తున్నాయి. ఈ పోస్ట్‌తో ఆమె ప్రేమ జీవితంపై చర్చ మొదలైంది.
Key Points
శ్రీలీల తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంది.
లంగా వోణి, కుంకుమతో ఆమె అందం అందరినీ మెస్మరైజ్ చేసింది.
కార్తీక్ ఆర్యన్ తో ప్రేమ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.
శ్రీలీల యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela ) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’ చిత్రంతో వచ్చింది. ఇక ‘ధమాకా’ (Dhamaka)మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క చిత్రంతోనే అమ్మడు విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకున్న శ్రీలీల వరుస చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. ఇక ఇండస్ట్రీని షేక్ చేస్తుందనుకున్న సమయంలోనే వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి కూడా తొలగించారు. దీంతో ఏం చేయలేక కొద్ది కాలంపాటు యాడ్స్ చేసింది. మళ్లీ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో కిస్ కిస్సిక్ అని ఐటమ్ సాంగ్‌లో మెరిసి అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఎంగేజ్‌మెంట్ ఊహాగానాలు
ఈ పాటతో శ్రీలీల మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. శ్రీలీల ప్రజెంట్.. పరాశక్తి, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh), జూనియర్(Junior), దుబారి, ఆషికి-3, లెనిన్ వంటి చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన పోస్ట్ చర్చకు దారితీస్తోంది. అయితే ఇందులో లంగా వోణిలో కనిపించిన ఆమె నగలు ధరించి అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది. అంతేకాకుండా కుంకుమ కూడా పెట్టుకుని కనిపించింది.
కార్తీక్ ఆర్యన్ తో ప్రేమ వ్యవహారం
ఇక ఓ అమ్మాయిని హగ్ చేసుకుని ఉన్న ఫొటో షేర్ చేస్తూ ‘‘ఈ రోజు చాలా బిగ్ డే’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె లుక్ చూస్తే ఎంగేజ్‌మెంట్‌కు రెడీ అయినట్లే ఉందని అంటున్నారు. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా? ఏంటని చర్చించుకుంటున్నారు.కానీ ఆమె అభిమానులు మాత్రం వాటిల్లో నిజం లేదని అంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమె కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలోఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీటిపై వీరిద్దరు స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఈనేపథ్యంలోనే శ్రీలీల అలా కనిపించడంతో అంతా పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
శ్రీలీల పోస్ట్‌తో ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. నిజానికి ఏమి జరిగిందో తెలియాలంటే ఆమె స్పందన కోసం ఎదురు చూడాలి. ప్రస్తుతానికి, ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్.


