📌 Key Points
- లెనిన్ సినిమాకు ఫస్ట్ డే నుంచే హిట్ టాక్, అఖిల్ కు కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్
- భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా అద్భుత నటన, ఆమె కెరీర్ కు ఫస్ట్ హిట్
- శ్రీలీల పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్, ఆమె సినిమా నుంచి తప్పుకోవడంపై చర్చ
- అఖిల్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, శ్రీలీల పై నెగెటివ్ పోస్టులతో నెట్టింట హడావిడి
అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా విడుదలై ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించింది. భాగ్యశ్రీ బోర్సేకు ఇది తొలి హిట్ కాగా, ఊహించని విధంగా శ్రీలీలపై ట్రోలింగ్ మొదలైంది. ఆసక్తికర వివరాలు ఇవీ.
లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్: అఖిల్ కు బ్లాక్ బస్టర్ టాక్
అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అన్ని ఏరియాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. దీంతో దశాబ్ద కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న అయ్యగారు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ పడబోతోన్నందుకు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. అఖిల్ కు హిట్టు పడాలని ఎదురు చూసిన ప్రతీ ఒక్కరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో, ఊహించని విధంగా నెట్టింట హీరోయిన్ శ్రీలీలపై పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. ‘లెనిన్’ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. శ్రీలీల ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించలేదు. అయినా ఈ మూవీలోకి ఆమెను లాగుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి కారణం, ఆమెకు ఈ చిత్రంతో చిన్న కనెక్షన్ ఉంది. భాగ్యశ్రీ కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలే. కొన్ని రోజుల షూటింగ్ కూడా చేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో అఖిల్ తో పాటుగా ఆమె లుక్ ను కూడా ప్రజెంట్ చేశారు. అయితే డేట్స్ ఇష్యూ రావడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు. View this post on Instagram A post shared by CINEMA 📈 (@tficonnects__) ‘లెనిన్’ మూవీలో భారతి అనే పాత్రలో భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది. తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అఖిల్ తో పాటుగా ఆమె నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. భాగ్యశ్రీ కెరీర్ లో ఫస్ట్ హిట్టు పడిందని ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భారతి పాత్రలో అసలు శ్రీలీలను ఊహించుకోలేమంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శ్రీలీలను తప్పించి మేకర్స్ మంచి పని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ పాత్ర చేసుంటే, భాగ్యశ్రీ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది కాదని అంటున్నారు. సినిమా మధ్యలో శ్రీలీల డైలాగ్ చెప్పినట్లు ఊహించుకుంటేనే భయమేస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. అయ్యగారికి హిట్ దక్కాలనే దేవుడు ఈ విధంగా కరుణించాడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లెనిన్ మూవీ రిలీజ్ వేళ, ఎక్స్ ఫీడ్ అంతా శ్రీలీల ట్రోల్స్ తో నిండిపోయింది. ఓవైపు అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడని అక్కినేని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే, మరోవైపు శ్రీలీలపై నెగెటివ్ పోస్టులు కనిపిస్తున్నాయి. ‘లెనిన్’ సక్సెస్ సాధిస్తే, అసలు ఆ సినిమాతో సంబంధం లేని శ్రీలీలను విమర్శించడం సరికాదు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ సినిమాలతో ఎంట్రీతోనే తన సత్తా ఏంటో చూపించింది శ్రీలీల. తన స్క్రీన్ ప్రజెన్స్, గ్లామర్, డ్యాన్సులతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ‘భగవంత్ కేసరి’ లాంటి సినిమాలో తన నటనతో మెప్పించింది. కానీ మిగతా చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి సినిమాలకు డేట్లు ఇచ్చి.. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ‘లెనిన్’ మూవీని వదులుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఒక్క హిట్టు పడితే ఇప్పుడు విమర్శించినవారే మళ్లీ ప్రశంసిస్తారు. అందుకే రాబోయే సినిమాలతో శ్రీలీల సాలిడ్ సక్సెస్ సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
భాగ్యశ్రీ బోర్సే పెర్ఫార్మెన్స్: ఫస్ట్ హిట్ సెలబ్రేషన్స్
శ్రీలీల ట్రోలింగ్: నెటిజన్లు ఏమంటున్నారు?
లెనిన్ సక్సెస్ తో అఖిల్ ఫ్యాన్స్ సంతోషంలో ఉండగా, శ్రీలీలపై ట్రోలింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూడండి.


