|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sridevi: శ్రీదేవికి కాంప్లిమెంట్‌.. టీజ్‌ చేశానని ఫీలయింది: బోనీకపూర్

Published: 13-08-2025, 6:52 AM
Sridevi: శ్రీదేవికి కాంప్లిమెంట్‌.. టీజ్‌ చేశానని ఫీలయింది: బోనీకపూర్

ప్రముఖ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె భర్త బోనీ కపూర్ ఒక ఆసక్తికరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి 27వ పుట్టినరోజు వేడుకలో జరిగిన సంఘటన ఇది.

Key Points

1

శ్రీదేవి 27వ పుట్టినరోజున బోనీకపూర్ చేసిన హాస్య వ్యాఖ్య.

2

బోనీకపూర్ సోషల్ మీడియాలో పాత ఫోటోను పోస్ట్ చేయడం.

4

శ్రీదేవి జయంతి సందర్భంగా బోనీకపూర్ గుర్తులు చేసుకోవడం.

శ్రీదేవి జయంతి వేడుకలు

టాలీవుడ్ ‌ మాత్రమే కాదు .. బాలీవుడ్ ‌ లోనూ అందాల తార ఎవరంటే ఠక్కున ఆమె పేరే చెప్పేస్తారు . తెలుగు సినిమాల్లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన అతిలోక సుందరి ఆమె . కానీ ఊహించని విధంగా 2018 లో ఈ లోకాన్ని విడిచి వెళ్లింది . ఇవాళ ఆమె జయంతి కావడంతో అభిమానులు వెండితెర అందాల రాణిని గుర్తు చేసుకుంటున్నారు . ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ? ఆమె మన అతిలోక సుందరి శ్రీదేవి . ఆగస్టు 13 న 1963 లో మీనంపట్టి అనే ప్రాంతంలో జన్మించింది .

బోనీకపూర్ గుర్తులు

ఇవాళ శ్రీదేవి జయంతి కావడంతో ఆమె భర్త బోనీ కపూర్ అరుదైన క్షణాలను గుర్తు చేసుకున్నారు . 1990 లో చెన్నైలో జరిగిన శ్రీదేవి 27 వ బర్త్ డే వేడుకలో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఆమె 27 వ పుట్టినరోజు కావడంతో నేను మాత్రం హ్యాపీ 26th బర్త్ ‌ డే అని విష్ చేశానని ఇన్ ‌ స్టాలో పోస్ట్ చేశారు . ఆమె మరింత యంగ్ ‌ అని చెప్పేందుకు అలా చేశానని అన్నారు . కానీ శ్రీదేవి మాత్రం తనను ఆటపట్టిస్తున్నారని చెప్పిందని గుర్తు చేసుకున్నారు .

27వ పుట్టినరోజు సంఘటన

కాగా .. శ్రీదేవి .. బోనీ కపూర్ ‌ ను 1996 లో పెళ్లాడారు . వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారు . జాన్వీ కపూర్ ‌ ప్రస్తుతం టాలీవుడ్ ‌ తో పాటు బాలీవుడ్ ‌ లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది . తన తల్లిలాగే స్టార్ ‌ హీరోయిన్ ‌ గా రాణిస్తోంది . శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓహోటల్ ‌ లో మరణించిన సంగతి తెలిసిందే .

శ్రీదేవి జయంతి సందర్భంగా బోనీ కపూర్ పంచుకున్న ఈ గుర్తులు ఆమె అభిమానులకు మరోసారి ఆమెను గుర్తు చేస్తాయి. శ్రీదేవి స్మృతి చిరకాలం మనసుల్లో నిలిచిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.