|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తన రెమ్యునరేషన్ డబుల్ చేసిన శ్రీలీల, టాలీవుడ్ నిర్మాతలకు బిగ్ షాక్ ?

Published: 29-06-2025, 7:46 AM

టాలీవుడ్ యువ నటి శ్రీలీల తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసింది. పుష్ప 2లోని ‘కిస్సిక్’ సాంగ్ ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అయితే, లెనిన్ సినిమా నుండి ఆమె వైదొలగడం వివాదాస్పదంగా మారింది.

Key Points

1

శ్రీలీల రెమ్యునరేషన్ రెట్టింపు అయింది.

2

పుష్ప 2 సినిమాలోని ‘కిస్సిక్’ సాంగ్ ఆమెకు భారీ క్రేజ్ తెచ్చింది.

3

ఆమె ప్రస్తుతం సినిమాకు రూ.7 కోట్లు డిమాండ్ చేస్తోంది.

4

లెనిన్ సినిమా నుండి శ్రీలీల తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీలీల రెమ్యునరేషన్ పెరుగుదల

టాలీవుడ్‌లో యువ నటిగా వేగంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది. వరుస చిత్రాలతో శ్రీలీల దూసుకుపోతోంది. ఈసారి శ్రీలీల తన రెమ్యునరేషన్ విషయంలో వార్తల్లో నిలిచింది.శ్రీలీల భారీగా తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రంలోని ఆమె స్పెషల్ డాన్స్ నంబర్ ‘కిస్సిక్’ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సాంగ్ వైరల్ కావడంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది. దీంతో పాటు బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్ సరసన ఆమె భారీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇవ్వనుండటం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

పుష్ప 2 సినిమా ప్రభావం

అయితే శ్రీలీల ఇటీవల అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో శ్రీలీల టాలీవుడ్ చిత్రాలని తగ్గిస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే శ్రీలీల తన పారితోషికాన్ని రెండు రెట్లు పెంచిందని వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం ఒక సినిమాకు రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తోందని, ఇది గతంలో తీసుకుంటున్న రూ. 3.5 నుంచి 4 కోట్లు కంటే రెండింతలు అని సమాచారం. రెమ్యునరేషన్ పెంచడం వల్లే ఆమె టాలీవుడ్ చిత్రాలకు దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 సినిమాలో డాన్స్ నంబర్‌కు శ్రీలీలకు సుమారు రూ. 2 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పాట ఆమె పాపులారిటీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించిందని పరిశీలకులు భావిస్తున్నారు.మొత్తంగా శ్రీలీల తన రెమ్యునరేషన్ ని రెట్టింపు చేయడం నిర్మాతలకు షాకింగ్ పరిణామమే అని చెప్పాలి.

లెనిన్ సినిమా నుండి వైదొలగడం

ఇక శ్రీలీల లెనిన్ సినిమా నుంచి వైదొలిగిన విషయం మరోసారి హాట్ టాపిక్ అయింది. శ్రీలీల ప్రస్తుత డేట్స్ ఇప్పటికే ఇతర ప్రాజెక్టులకు కేటాయించబడి ఉండటంతో లెనిన్ షూటింగ్ షెడ్యూల్‌తో క్లాష్ అవుతున్నాయి. ఆమె డేట్లను రీషెడ్యూల్ చేయాలనుకున్నా, చివరకు వీలుకాలేదు అని వార్తలు వస్తున్నాయి.అయితే శ్రీలీల లెనిన్ మూవీ నుంచి తప్పుకోవడానికి అసలైన కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు.

ప్రస్తుతం శ్రీలీల రవితేజ మాస్ జాతర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికి 3 చిత్రంలో నటిస్తోంది.

శ్రీలీల రెమ్యునరేషన్ పెంపు నిర్మాతలకు షాక్‌ను కలిగించింది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులు మరియు లెనిన్ సినిమా నుండి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.