|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ కామెంట్స్! ‘ENE 2’లో ఛాన్స్ అంటే బూతులా? శ్రీనాథ్ మాగంటి ఫైర్!

Published: 03-03-2026, 11:35 PM
  • శ్రీనాథ్ మాగంటి: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ ప్రమోషన్స్ షురూ!
  • ‘ఈ నగరానికి ఏమైంది 2’లో అవకాశంపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి
  • బాల సతీష్ దర్శకత్వంలో శ్రీనాథ్ మాగంటి సోలో హీరోగా చిత్రం
  • మార్చి 6న ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ విడుదల!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాలో అవకాశం రావడంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే చూడండి.

టాలీవుడ్ లో శ్రీనాథ్ మాగంటి సంచలనం

Srinath Maganti: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీనాథ్‌ మాగంటి. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. హిట్, లక్కీ భాస్కర్, యానిమల్ ఇలా చాలా సినిమాల్లో అదిరిపోయే పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సోలో హీరోగా చేస్తున్నాడు శ్రీనాథ్‌ మాగంటి(Srinath Maganti). అదే ‘మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌’.

‘ఈ నగరానికి ఏమైంది 2’ పై షాకింగ్ కామెంట్స్

దర్శకుడు బాల సతీష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్‌ మాగంటి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

మార్చి 6న ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ విడుదల

నేను హీరోగా చేస్తున్ మొదటి సినిమా ఇది. ఎన్నో కష్టాలు పడితే ఇండస్ట్రీలో ఈ స్టేజి కి వచ్చాను. నేను ఎవరి అవకాశాలను లాక్కోలేదు. నేను, ఈ నగరానికి ఏమైంది 2లో కూడా చేస్తున్నాను. కానీ, ఈ సినిమాలో నా పేరు అనౌన్స్ మెంట్ రాగానే చాలా మంది నాపై నెగిటీవ్ కామెంట్స్ చేశారు. బూతులు తిడుతూ మెసేజెస్ చేశారు. కానీ, ఆ పాత్ర నేను ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఎలాంటి రాజకీయాలు చేయలేదు. అంటూ చెప్పుకొచ్చాడు. దాంతి శ్రీనాథ్‌ మాగంటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీనాథ్ మాగంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీతో ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.