
కేజీఎఫ్‌తో పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తాజాగా నానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు వీరిద్దరినీ పర్ఫెక్ట్ జోడిగా అభివర్ణిస్తున్నారు.
Key Points
శ్రీనిధి శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నానితో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
ఫోటోలు వైరల్‌గా మారాయి, నెటిజన్లు 'పర్ఫెక్ట్ జోడి' అంటూ కామెంట్ చేస్తున్నారు.
శ్రీనిధి ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో 'తెలుసు కదా' సినిమాలో నటిస్తోంది.
శ్రీనిధి 'హిట్-3' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
శ్రీనిధి శెట్టి ఇన్‌స్టా పోస్ట్ వైరల్
రాకింగ్ స్టార్ యష్(Yash) నటించిన కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా నాని(Nani) సరసన ‘హిట్-3’(Hit-3) సినిమాలో నటించి మెప్పించింది. మే 1న రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది.
నానితో శ్రీనిధి శెట్టి ఫోటోలు
అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో నాని హీరోతో దిగిన క్యూట్ ఫొటోస్‌ను షేర్ చేసింది. ఇక వాటికి.. ‘వర్షపు సాయంత్రం, మంచి ఓల్డ్ మ్యూజిక్ అండ్ అన్ని అనుభూతులతో కూడిన మోనోక్రోమ్ చిత్రాల సమితి.. అయితే ఈ మ్యాజిక్ క్రియేట్ కావడానికి మెయిన్ రీజన్ శైలేష్ కొలను’ అని అతన్ని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు పర్ఫెక్ట్ రీల్ జోడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల నుండి పాజిటివ్ స్పందన
A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty)
శ్రీనిధి శెట్టి మరియు నాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం వారిద్దరికీ మంచి పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి సినిమాలో నటించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.


