
హిట్ 3 విజయంతో శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఆమె నటించిన ‘తెలుసు కదా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం గురించి శ్రీనిధి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు చెప్పిన కథ వేరని, రెండేళ్ల ప్రయాణంలో అనేక మార్పులు జరిగాయని తెలిపింది.
Key Points
శ్రీనిధి శెట్టి హిట్ 3 సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె ప్రస్తుతం నటిస్తున్న 'తెలుసు కదా' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
సినిమా కోసం ముందు చెప్పిన కథ వేరని, ఫైనల్ చేసిన సినిమా వేరని శ్రీనిధి శెట్టి వెల్లడించింది.
దాదాపు రెండేళ్ల ప్రయాణంలో కథలో క్రియేటివ్, టెక్నికల్ పరంగా చాలా మార్పులు జరిగాయని తెలిపింది.
శ్రీనిధి శెట్టి: ‘తెలుసు కదా’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు
Srinidhi Shetty: హిట్ 3 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ శ్రీనిధి శెట్టి. నాని హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. క్రైం థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అలాగే, హీరోయిన్ శ్రీనిధికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో, తెలుగులో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే, ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న సినిమా “తెలుసు కదా”. (Srinidhi Shetty)స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోనా తెరకెక్కిస్తుండగా రాశి ఖన్నా మరో హీరోయిన్ గా నటిస్తోంది.
Samantha: పండగ పూట ‘కొత్త ప్రయాణం’.. రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిందా.. ఇక అన్నీ అక్కడినుంచే!
కథలో మార్పులు: రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణం
ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో, ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో బిజీ అయ్యారు మూవీ టీం. ఇందులో భాగంగానే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధి శెట్టి తెలుసు కదా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘తెలుసు కదా’ విడుదల, ప్రమోషన్స్
“తెలుసు కదా సినిమా కోసం ముందు నాకు చెప్పిన కథ వేరు. ఫైనల్ చేసిన సినిమా వేరు. దాదాపు రెండేళ్ల క్రితం నేను ఈ కథ విన్నాను. కథలోని ఎమోషనల్ కంటెంట్ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాం. కానీ, ఈ ప్రాసెస్ లో చాలా మార్పులు వచ్చాయి. క్రియేటీవ్ పరంగా, టెక్నీకల్ పరంగా చాలా మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగా కథను మార్చారు. ఫైనల్ అవుట్ ఫుట్ చాలా కొత్తగా వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమాను అందరికీ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీనిధి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. రెండేళ్ల ప్రయాణం తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌పుట్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది.


