|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SS రాజమౌళి: భారత ఆర్మీ ఫొటోలు, వీడియోలు తీయొద్దు

Published: 09-05-2025, 9:12 AM
SS రాజమౌళి: భారత ఆర్మీ ఫొటోలు, వీడియోలు తీయొద్దు

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు సమాచారాన్ని గుర్తించి జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

Key Points

1

రాజమౌళి భారత సైన్యం ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని కోరారు.

2

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని ఆయన హెచ్చరించారు.

4

ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా షూటింగ్‌కు విరామం ఇచ్చారు.

రాజమౌళి హెచ్చరిక

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం

‘పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

సైనిక చర్యల ఫోటోలు, వీడియోలు

మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.

రాజమౌళి చేసిన ఈ విజ్ఞప్తి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలా ముఖ్యమైనది. జాగ్రత్తగా ఉండటం, అసత్య ప్రచారాన్ని నమ్మకపోవడం చాలా అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.