
మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ ఖాన్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో అతిథిగా హాజరైంది. అక్కడ ఆమె అడిగిన ఓ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ ప్రశ్న ఏంటంటే…
Key Points
మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ ఖాన్‌ను లైవ్ పాడ్‌కాస్ట్‌లో 'ఎందరితో సెక్స్ చేశావ్?' అని ప్రశ్నించింది.
అర్హాన్ తెలివిగా ఆ ప్రశ్నను తప్పించుకున్నాడు.
ఈ ఘటన నెటిజన్లలో వివాదాస్పదంగా మారింది.
కొందరు మలైకా ప్రవర్తనను తప్పుబడుతున్నారు, మరికొందరు అర్హాన్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.
మలైకా అరోరా కొడుకు పాడ్‌కాస్ట్
మలైకా అరోరా కొడుకు అర్హాన్ ఖాన్ ప్రస్తుతం ఓ పాడ్ కాస్ట్ నడిపిస్తున్నాడు. డంబ్ బిర్యానీ పేరుతో ఓడ్ కాస్ట్ అంటూ కొత్త ట్రెండ్ తెరమీదకు తెచ్చాడు. ఇప్పటికే గెస్ట్‌లుగా తండ్రి అర్బాజ్ ఖాన్, బాబాయ్ సోహెల్ ఖాన్ హాజరుకాగా.. ఇప్పుడు మలైకా అతిథిగా వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. కారణం మలైక.. తన కొడుకు బాడీ కౌంట్ అడగడం. అవును.. ఎందరితో సెక్స్ చేశావ్ అని ఓపెన్‌గా అడిగేసింది. కానీ ఈ ప్రశ్నను చాలా తెలివిగా తప్పించుకున్నాడు అర్హాన్.
ట్రుత్ ఆర్ స్పైసీ గేమ్‌లో భాగంగా ఇద్దరు ఒకరినొకరు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఇందులో భాగంగానే బాడీ కౌంట్ గురించి అడిగింది మలైక. అయితే తెలివిగా అతను స్పైసీని చూజ్ చేసుకుని ఆన్సర్ దాటేశాడు. దీంతో ఈ ప్రోమో చూసిన జనాలు కొందరు ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుంటే.. ఇంకొందరు అదే ప్రశ్న అతను అడిగితే మలైక ఎక్కడ మొహం పెట్టుకుంటుందని తిట్టిపోస్తున్నారు. కొడుకును పట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? కనీసం జనాలు చూస్తున్నారన్న సెన్స్ కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
వివాదాస్పద ప్రశ్న
నెటిజన్ల స్పందన
మలైకా అరోరా ప్రవర్తనపై నెటిజన్ల అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అర్హాన్ ఎలా స్పందిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


