|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ రివ్యూ: ‘ధురంధర్ 2’ అత్యంత చెత్త సినిమా! హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Published: 20-03-2026, 7:35 AM
  • రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2’ చిత్రంపై దివ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు.
  • సినిమా విసుగు తెప్పించేలా ఉందని, డబ్బు వృథా అని ఆమె అన్నారు.
  • దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్ ఏవీ బాగాలేదని ఆమె విమర్శించారు.
  • సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమాపై ప్రముఖ నటి దివ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు. సినిమా చూసి డబ్బులు వృథా చేసుకోవద్దని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దివ్య స్పందన ధురంధర్ 2 పై విమర్శలు

Star Heroine: రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ సినిమా ధురంధర్ 2 ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌కే 500 కోట్ల మార్క్ చేరే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే పుష్ప 2..బాహుబలి, జవాన్ వంటి పెద్ద సినిమాల రికార్డులను కూడా ఈ మూవీ సవాల్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

సినిమా విడుదలైన తర్వాత పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ పనితనం, రణ్‌వీర్ సింగ్ నటనపై మంచి స్పందన వచ్చింది. అయితే అందరి అభిప్రాయం ఒకేలా ఉండదు. ప్రముఖ నటి దివ్య స్పందన (రమ్య) మాత్రం ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు.

సినిమా చూసిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, “ఇప్పుడే ధురంధర్ 2 చూశాను. ఇది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సినిమా. అత్యంత విసుగు పుట్టించిన సినిమా. చూస్తుంటే ఒక పొడవైన, బోరింగ్ పాఠ్యపుస్తకం చదివినట్టు అనిపించింది” అని అన్నారు.

సినిమా టెక్నికల్ అంశాలపై అసంతృప్తి

అంతేకాకుండా, “థియేటర్‌లో టైమ్, డబ్బు వృథా చేసుకోవద్దు. పాజ్ చేసి ఫోన్ స్క్రోల్ చేస్తూ జీవితంపై ఆలోచించే పరిస్థితి వస్తుంది” అని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా టెక్నికల్ అంశాలపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్..ఏదీ సరిగా లేదు” అని పేర్కొన్నారు.

సినిమాలో హింసాత్మక సన్నివేశాలపై కూడా ఆమె మండిపడ్డారు. “ఇది సినిమా కాదు, హింసను ఎంత రకాలుగా చూపించవచ్చో చెప్పే విజువల్ ప్రదర్శనలా ఉంది” అని వ్యాఖ్యానించారు. అలాగే హీరో పాత్రపై కూడా సెటైర్లు వేస్తూ, “రణ్‌వీర్ ఏం మోస్తున్నాడు? నాకు కనిపించింది అతని జుట్టే” అని అన్నారు.

చివరగా ఆమె సినిమా మొత్తాన్ని సమీక్షిస్తూ, “ధురంధర్ 2 పూర్తిగా నిరాశపరిచింది. ఇది బోరింగ్ కంటెంట్ మాత్రమే” అని తేల్చేశారు. అలాగే దర్శకుడికి సూచిస్తూ, “అతి జాతీయత, ప్రచార ఆర్భాటం ఇప్పుడు అవుట్‌డేటెడ్” అని అన్నారు.

సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కామెంట్స్

ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..రణ్‌వీర్ అభిమానులు దివ్య స్పందనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. భారీ విజయంతో పాటు వివాదాన్ని కూడా తెచ్చుకున్న సినిమా గా ధురంధర్ 2 నిలిచింది.

దివ్య స్పందన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణ్‌వీర్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా వివాదాస్పదంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.