|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్‌ హీరోయిన్‌ సిమ్రాన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్‌

Published: 06-06-2025, 6:44 AM
స్టార్‌ హీరోయిన్‌ సిమ్రాన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్‌

ప్రముఖ తెలుగు సినీనటి సిమ్రాన్ కుమారుడు అధీప్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని సిమ్రాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Key Points

1

సిమ్రాన్ కుమారుడు అధీప్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

2

ఈ సంతోషకరమైన సందర్భాన్ని సిమ్రాన్ సోషల్ మీడియాలో పంచుకుంది.

4

సిమ్రాన్ తన కుమారుని గురించి తన అభిమానాలను వ్యక్తం చేసింది.

సిమ్రాన్ కుమారుడి గ్రాడ్యుయేషన్

ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్‌ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు.  అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్‌మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ముంబైకి చెందిన సిమ్రాన్‌ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో దీపక్‌ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్‌తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశాడు. అందులో సీరియల్స్‌తో పాటు పలు చిన్న బడ్జెట్‌ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్‌ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు

అయితే, ఇప్పుడు అధీప్‌ గ్రాడ్యేషన్‌ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్‌ ఇలా చెప్పుకొచ్చారు. ‘ చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి  మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.’ అని సిమ్రాన్‌ పేర్కొన్నారు.

సిమ్రాన్ సినీ జీవితం

సీనియర్ స్టార్ హీరోయిన్  సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్‌లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో చిరంజీవి,రజనీకాంత్‌,కమల్‌ హాసస్‌, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా మెప్పించింది.

సిమ్రాన్ కుటుంబ సంతోషంలో మునిగితేలుతోంది. అధీప్ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆమె కోరుకుంటోంది. అభిమానుల నుండి అనేక శుభాకాంక్షలు వస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.