|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Straw Movie Review: కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం

Published: 21-06-2025, 3:12 AM
Straw Movie Review: కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం

ఒక ఒంటరి తల్లి తన కూతురి కోసం చేసే పోరాటం గురించి ఉత్కంఠభరితమైన కథ ‘స్ట్రా’. తక్కువ బడ్జెట్‌తో తీయబడినప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలోని ప్రధాన పాత్రధారి నటన అద్భుతం.

ఒంటరి తల్లి యొక్క కష్టాలు

ఓ ఊహకు మంచి ఆలోచన తోడై దానికి క్రియేటివిటీ అనే మసాలాను జోడిస్తే అవుతుంది ఓ అద్భుతమైన సినిమా. ఒక వ్యక్తిని అది కూడా ఒక తల్లిని… పరిస్థితులు, సమాజం నిస్సహయరాయుల్ని చేస్తే… నలుగురు కలిసి అన్ని రకాలుగా ఒక మూలకు నెట్టేస్తే ఆమేం చేసిందన్న విషయాన్ని ఊహకు అందనట్టుగా అదే సమయంలో మనసుకు హత్తుకునేట్టుగా తీసే దర్శకులు ప్రపంచ స్థాయిలో చాలా మందే ఉన్నారు. బోలెడంత ఖర్చుతో , పెద్ద స్టార్ కాస్టింగ్ తో ఓ కథను తీయడం పెద్ద కష్టమేమీ కాదు, కాని అదే సమయంలో చిన్న ఆలోచనను చిన్న స్టార్ కాస్ట్ తో ప్రేక్షకుడిని ఆకట్టుకోవడం కత్తి మీద సామే.

అలా తన ఆలోచనకు  తానే నిర్మాతగా మారి, దర్శకత్వం వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన హాలివుడ్ దర్శకుడు టైలర్ పెర్రీ నిజంగా పెద్ద సాహసమే చేశాడు. ఆ సాహసం పేరే తాను తీసిన సినిమా స్ట్రా(Straw Movie Review). చిన్న ఆలోచనతో తన సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కదలనివ్వకుండా చేసిన సినిమా ఈ స్ట్రా. ఇది ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.

కూతురి కోసం ఆమె చేసే ప్రయత్నాలు

అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం…జనయా ఓ సింగిల్ మదర్, తన కూతురితో చిన్నపాటి ఇరుకు గదిలో అతి కష్టం మీద సర్దుకుంటూ ఉంటుంది. ఓ షాపింగ్ మాల్ లో పని చేసే జనయాకు ఆనందం అన్న విషయమే తెలియదు, అంతగా ఆమె జీవితం కష్టాలమయం. కనీసం స్కూల్ లో కూతురికి ఓ రోజు బ్రెడ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఓ రోజు కూతురి బ్రెడ్ కోసం డబ్బులు లేక బ్యాంకు కు వెళ్ళి విత్ డ్రా చేయడానికి వెళితే, బ్యాంకు సిబ్బంది ఏదో కారణాల వల్ల డబ్బు ఇవ్వలేమని చెబితే వాళ్ళని ఎదిరించడానికి గన్ చూపిస్తుంది. బ్యాంకు లో గన్ చూపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది అవాక్కయి పోలీసులకు ఫోన్ చేస్తారు.

అనూహ్యమైన ట్విస్ట్

ఇక అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. జనయాకి బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇస్తారా, లేదా గన్ చూపించినదానికి జనయాను పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. చూడడానికి ఇది చిన్న కథే అయినా ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తో చూసే ప్రేక్షకుల మతి పోవడం ఖాయం. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా తరాజి పి హాన్సన్ జీవించిందని చెప్పవచ్చు. నిజానికి ఆ ఆలోచనకే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా పెద్ద వాళ్ళకు మాత్రమే. అలాగే ఇది తెలుగులోనూ లభ్యమవుతుంది. ఈ రివ్యూ చదివిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కాని ఇలాంటి సినిమా మాత్రం చాలా అరుదు. మస్ట్ వాచ్.

చిన్న కథ అయినప్పటికీ, స్ట్రా సినిమాలోని అద్భుతమైన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. తప్పకుండా చూడవలసిన సినిమా ఇది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.