
📌 Key Points
- ఇండోర్‌లో వీధి కుక్కల దాడిలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
- బాధితులకు ఆసుపత్రిలో యాంటీ-రేబిస్ చికిత్స అందిస్తున్నారు.
- నగరంలో ప్రతి నెలా 4,500లకు పైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి.
- వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నలుగురు యువకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నలుగురిపై దాడి చేసిన వీధి కుక్క
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక వీధి కుక్క రెచ్చిపోయింది. ఆరుబయట కూర్చున్న యువకుల పై విచక్షణారహితంగా దాడి చేసి నలుగురిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. మౌ (Mhow) ప్రాంతంలోని కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవటీ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటుండగా.. ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చిన వీధి విరుచుకుపడింది. ప్లాస్టిక్ కుర్చీలతో అడ్డుకున్నా, తరిమేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గకుండా ఒకరి తర్వాత మరొకరిపై పదే పదే దాడి చేసింది. మెడ, కాళ్లపై దారుణంగా కరిచింది. చివరకు కర్రలు, రాళ్లతో గట్టిగా కొట్టడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ దాడిలో ఫరూఖ్, అర్మాన్, షాకిర్, మాలిక్ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే మౌ లోని సివిల్ ఆసుపత్రికి తరలించి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు ఇప్పించారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇండోర్ నగరంలో వీధి కుక్కల దాడులు ఒక పెద్ద ప్రజా సమస్యగా మారాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. నగరంలో నెలకు సగటున 4,500లకు పైగా డాగ్ బైట్ కేసులు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రతిరోజూ 100 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. వీధి కుక్కల జనాభా విపరీతంగా పెరగడం, చెత్త నిర్వహణ సరిగ్గా లేకపోవడం, జంతు జనన నియంత్రణ (నస్బందీ) ప్రక్రియ నత్తనడకన సాగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని అధికారులు భావిస్తున్నారు. వెంటనే వీధి కుక్కలను పట్టుకుని, తమకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న సీసీటీవీ దృశ్యాలు
భయాందోళనలో ఇండోర్ ప్రజలు
ఇండోర్ నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ఇలాంటి దాడులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.



Posani Krishna Murali Quits Politics for Filmmaking: Will Release One Film Annually