
📌 Key Points
- గుజరాత్‌లోని యూనివర్సిటీలో సంస్కార్ సంగమం కార్యక్రమంలో బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసిన యువతి.
- సంప్రదాయ దుస్తుల్లో డ్యాన్స్ చేయడంపై కొందరు ప్రశంసలు, మరికొందరు విమర్శలు చేశారు.
- ట్రోలింగ్‌తో భావోద్వేగానికి గురైన యువతి కన్నీటితో వీడియో విడుదల చేసింది.
- చీరలో డ్యాన్స్ చేయడంలో తప్పులేదని, ఇది కేవలం కళాత్మక ప్రదర్శన మాత్రమేనని యువతి స్పష్టం చేసింది.
గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం సోషల్ మీడియాలో దుమారం రేపింది. చీరలో డ్యాన్స్ చేసినందుకు ఓ యువతిని ట్రోల్ చేయడంపై ఆమె తీవ్రంగా స్పందించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
యూనివర్సిటీలో డ్యాన్స్ చేసిన యువతి
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు సోషల్ మీడియా ఒక వ్యక్తికి వేగంగా గుర్తింపు తీసుకురాగలదు.. విమర్శలు కూడా అదే వేగంతో వస్తాయి. కొన్ని సందర్భాల్లో చిన్న వీడియో కూడా పెద్ద చర్చకు దారితీయోచ్చు. తాజాగా ఓ యువతి విషయంలో కూడా అదే జరిగింది. స్టేజ్ పై ఆమె చేసిన డాన్స్ తీవ్ర చర్చకు కారణమైంది.
ట్రోలింగ్‌కు గురైన విద్యార్థిని
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వడోదరలోని ఓ యూనివర్సిటీలో ‘సంస్కార్ సంగమం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఓ యువతి స్టేజ్‌పై బాలీవుడ్ పాటకు డాన్స్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆమె పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ పెరిగింది. యువతి ‘ధక్ ధక్’ అనే పాటకు చిందులేసింది. అయితే, ఆమె సంప్రదాయ దుస్తులైన చీరలో ఆ పాటకు డాన్స్ చేయడం పై కొంతమంది ప్రశంసలు కురిపించగా మరి కొందరు మాత్రం తీవ్రంగా విమర్శించారు.
యువతి ఎమోషనల్ వీడియో విడుదల
దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో డాన్స్‌పై ట్రోలింగ్ పెరగడంతో ఆ విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. దీనిపై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై స్పందించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసింది. వీడియోలో ఉన్న ప్రకారం.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ యువతి చీరలో డాన్స్ చేయడంలో అశ్లీలత ఏముందని ప్రశ్నించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ ఎమోషనల్ అయింది. కేవలం ఒక కళాత్మక ప్రదర్శన మాత్రమే ఇచ్చానని స్పష్టం చేసింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనలై ఆమె పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్‌ను ఖండించారు.
చివరగా, కళాత్మక ప్రదర్శనను ప్రోత్సహించాల్సింది పోయి ట్రోల్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


