
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘సు ఫ్రమ్ సో’ (సులోచన ఫ్రమ్ సోమేశ్వరం) సినిమా తాజాగా తెలుగు ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవంబర్ 5 నుంచి జియో సినిమాలో ఈ హారర్ కామెడీ చిత్రాన్ని మీరు వీక్షించవచ్చు.
Key Points
కన్నడలో సూపర్ హిట్ అయిన 'సు ఫ్రమ్ సో' తెలుగు ఓటీటీలోకి!
ఆగస్టు 8న థియేటర్లలో విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా..
జేపీ తుమినాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మీ ఇంటి తెరపై ఆస్వాదించండి!
సు ఫ్రమ్ సో ఓటీటీ విడుదల తేదీ
కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన హిలారియస్ కామెడీ ఎంటర్ టైనర్ సు ఫ్రమ్ సో ( సులోచన ఫ్రమ్ సోమేశ్వరం) . కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ .40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది . శాండల్ వుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఈ హారర్ కామెడీ మూవీ ఆగస్టు 8 న థియేటర్లలో సందడి చేసింది .
కథానకం: హారర్ కామెడీ ఎంటర్‌టైనర్
తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైపోయింది . ఈ నెల ఐదో తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది . ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . ఈ చిత్రానికి జేపీ తుమినాద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై శశిధర్ శెట్టి బరోడా, రాజ్ బీ శెట్టి , రవి రాయ్ కలస నిర్మించారు . ఇంకేందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో ఎంజాయ్ చేయండి .
ఎక్కడ చూడాలి?
కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
థియేటర్లలో మిస్ అయిన ‘సు ఫ్రమ్ సో’ సినిమాను ఇప్పుడు జియో సినిమాలో చూసి ఆనందించండి. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ మీకు తప్పకుండా నచ్చుతుంది.


