|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SubhaShree Rayaguru: ‘డబ్బు కోసమే పెళ్లి, భరణం ఎంత?’ ఆ లక్షణం చూసే ప్రేమకు ఒప్పుకున్నా..!

Published: 29-06-2025, 4:15 AM

బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు తన ప్రేమ వివాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌కు ఆమె ఎలా స్పందించిందో తెలుసుకుందాం.

Key Points

1

శుభశ్రీ రాయగురు తన ప్రేమ వివాహం గురించి మాట్లాడారు.

2

ఆమెకు డబ్బు కాదు, భవిష్యత్తు భాగస్వామిలో గౌరవం, స్థిరత్వం ముఖ్యమని తెలిపారు.

4

అజయ్ మైసూర్ తో ఆమె ప్రేమ వివాహం 9 నెలల క్రితం జరిగింది.

శుభశ్రీ రాయగురు ప్రేమ కథ

ఒక్క పాటతో పడిపోయింది బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌తో కలిసి మేజస్టీ ఇన్‌ లవ్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్‌ జరిగింది.

మోడల్‌గా.. తాజాగా ఈ ట్రోలింగ్‌పై శుభశ్రీ రాయగురు ( SubhaShree Rayaguru ) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్‌ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్‌ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్‌ చేశాను. ఫెమినా మిస్‌ ఇండియా ఒరిస్సాగా టైటిల్‌ గెలిచాను. ఐఏఎస్‌ కోచింగ్‌కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్‌బాస్‌ ఆఫర్‌ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్‌ వచ్చింది.

సాంగ్‌ షూటింగ్‌లో పరిచయం ఈ మధ్యే మేజస్టీ సాంగ్‌ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్‌ షూటింగ్‌లో అజయ్‌ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్‌ జరిగింది. చివరి రోజు షూటింగ్‌లో తను నాకు ప్రపోజ్‌ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్‌ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు.

సోషల్ మీడియా ట్రోలింగ్‌కు ఆమె స్పందన

డబ్బు కోసమే పెళ్లి? మా ఇద్దరి గురించి సోషల్‌ మీడియాలో చాలా ట్రోల్‌ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్‌ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.

పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్‌ నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్‌ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్‌ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను.

డబ్బు కంటే గౌరవం ముఖ్యం

ట్రోలింగ్‌ దెబ్బకు జ్వరం ఈ ట్రోల్స్‌ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్‌ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్‌ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్‌, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది.

శుభశ్రీ రాయగురు తన ప్రేమ వివాహం గురించి తెలిపిన విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. డబ్బు కాదు, గౌరవం, ప్రేమే ముఖ్యమని ఆమె స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.