
📌 Key Points
- సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ చిత్రం విడుదల, హిందీ వ్యతిరేక ఉద్యమం నేపధ్యం.
- శివ కార్తీకేయన్ హీరోగా, శ్రీలీల తొలి తమిళ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ.
- సినిమాపై నెగిటివ్ కామెంట్లు, బ్యాన్ చేయాలనీ డిమాండ్లు – దర్శకురాలు సీరియస్ వార్నింగ్.
- ట్రోలింగ్ అంతా స్టార్ హీరో అభిమానుల నుంచే వస్తోందని సుధా కొంగర ఆరోపణ.
టాలీవుడ్‌లో సంచలనం! సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘పరాశక్తి’ చిత్రం విడుదలైన నాటి నుండి వివాదాల్లో చిక్కుకుంది. కొందరు కావాలనే సినిమాను టార్గెట్ చేస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందో తెలుసుకోండి!
‘పరాశక్తి’ సినిమాపై ట్రోలింగ్ దాడులు!
సుధా కొంగర (Sudha Kongara)దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakti).1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలోఈ సినిమా తెరకెక్కింది. ఇందులో శివ కార్తీకేయన్(Sivakarthikeyan) హీరోగా నటించగా.. రవి మోహన్ విలన్‌గా కనిపించారు. శ్రీలీలకు ఇదే తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ మూవీ జనవరి 10న విడుదల కాగా.. వివాదంలో చిక్కుకుంది. విడుదలైన రోజు నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొందరు కావాలనే నెగిటివ్ కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో వాడకూడని పదం వాడారని ‘పరాశక్తి’ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఈ వివాదాలపై స్పందించిన దర్శకురాలు సుధా కొంగర తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. పరాశక్తి’పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని ఆమె మండిపడ్డారు. “ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు సృష్టించి, తీవ్ర ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నారు. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.
ఈ ట్రోలింగ్ అంతా ఓ స్టార్ హీరో అభిమాన సంఘాల నుంచే వస్తోందని, వారి సినిమాలు ఇంకా విడుదల కూడా కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. “ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా అన్యాయమైనది. ఫేక్ ఐడీలతో మాపై దారుణమైన పోస్టులు చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ అంశంపై కూడా సుధా కొంగర స్పందించారు. “సెన్సార్ సర్టిఫికేట్ పొందడం ఏ గొప్ప ఘనత కాదు. కావాలంటే వెళ్లి అన్నా అభిమానులను క్షమాపణలు అడిగి, ఒక ‘క్షమాపణ సర్టిఫికేట్’ తీసుకోండి” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంకా వారం రోజుల సమయం ఉందని, ఆలోపుగా పరిస్థితులు మారితే ‘పరాశక్తి’కి థియేటర్లలో కొనసాగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటూ ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
స్టార్ హీరో అభిమానులే కారణమా?
సుధా కొంగర సంచలన వ్యాఖ్యలు!
సుధా కొంగర చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


