|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: సుకుమార్-డీఎస్పీ 20 ఏళ్ల బంధానికి బీటలు! RC17 నుండి రాక్‌స్టార్ ఔట్?

Published: 08-07-2026, 7:00 AM
  • సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ 20 ఏళ్లుగా కలిసి పనిచేశారు.
  • RC17 సినిమాకు సుకుమార్ కొత్త సంగీత దర్శకుడిని వెతుకుతున్నారు.
  • పుష్ప 2 BGM విషయంలో వచ్చిన విభేదాలే విడిపోవడానికి కారణం.
  • శాశ్వత్ సచ్‌దేవ్, హర్షవర్దన్ రామేశ్వరావ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ల 20 ఏళ్ల బంధం ముగిసిందా? RC17 సినిమా నుండి దేవిశ్రీ తప్పుకున్నారనే వార్తలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. పుష్ప 2 సమయంలో జరిగిన సంఘటనలే దీనికి కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సుకుమార్-డీఎస్పీ బంధానికి బీటలు?

RC17 Music : సుకుమార్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో హీరో ,హీరోయిన్లు,టెక్నీషియన్ అందరూ మారిపోయారు.కానీ మారంది ఒక్కరే.. తనే దేవీశ్రీ ప్రసాద్.ఆర్య,జగడం’,’ఆర్య 2′,’1:నేనొక్కడినే’  ‘రంగస్థలం’,పుష్ప,పుష్ప 2 వరకు అన్ని సినిమాలకి సంగీతం ఇచ్చింది అతడే. దీంతో వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంతలా ఉండకపోతే ఇన్ని ఏళ్ల పాటు కలిసి పని చేస్తారు అని అనుకున్నారంతా.అది నిజం కూడా.కానీ ప్రస్తుత వాలకం చూస్తుంటే ఆ బందానికి బీటలు వారినట్టే కనిపిస్తుంది.

అవును ..ఇన్నేళ్ళ పాటు dsp తో ట్రావెల్ అయిన సుక్కు తాజాగా రామ్ చరణ్ తో చేయబోయే  #RC17 లి మాత్రం వేరే సంగీత దర్శకుడి వైపు దిక్కులు చూస్తున్నాడట.ఇక మరి కొందరు మాత్రం  దేవీనే వాంటెడ్ గా పక్కకి తప్పుకున్నాడని అంటున్న మాట. నిజానికి ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అవకపోయినా ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో ఇది నిజమేనేమో అన్నంతగా తెగ సర్క్యులేట్ అవుతుంది.

పుష్ప 2 వివాదమే కారణమా?

అయితే  ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలన్నింటికి కారణం ‘పుష్ప 2: ది రూల్’సినిమా సమయంలో జరిగిన సంఘటనలే.ఆ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా సినిమాకి చేయాల్సిన  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మరియు రీ-రికార్డింగ్ పనులు అనుకున్న సమయానికి జరగలేదు.

ఫలితంగా మెంటల్ ప్రెజర్ పెరిగిపోయి వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే సుక్కు అలా తను చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోరు వేరేవాళ్ళతో చేయించుకోవడం దేవిశ్రీకి నచ్చలేదని,దాంతో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చిందని అప్పట్లో సోషల్ మీడియా కోడై కూసింది.ఇక ప్రస్తుతం అవి దృష్టిలో పెట్టుకొనే ఇద్దరు కలిసి పని చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

RC17కి కొత్త సంగీత దర్శకుడు ఎవరు?

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో సుక్కు తెరకెక్కించబోయే #RC17 కోసం సరికొత్త సౌండింగ్ ని ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాడట సుక్కు, ఇందుకోసం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్  సినిమాకి మ్యూజిక్ అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ ని తన సినిమా కోసం సెలెక్ట్  ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట.ఈ ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమా కే మ్యూజిక్ విభాగంలో నేషనల్ అవార్డ్ అందుకున్నాడు శాశ్వత్ సచ్‌దేవ్.ఇక ఇతని పాటుగా ‘అర్జున్ రెడ్డి’,’యానిమల్’ లాంటి సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్దన్ రామేశ్వరావ్ ,అలాగే కుటుట్టి పులి’ మరియు మ్యూజిక్ వీడియోస్ తో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని తాజాగా అల్లు – అట్లీ చేస్తున్న రాకా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న  కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్‌ల పేర్లను కూడా సుకుమార్ పరిశీలిస్తున్నాడని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ .

ఇక చరణ్ – సుక్కు కాంబోలో, మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కనున్న ఈ సినిమా విషయానికి వస్తే ఇది దసరా తర్వాత సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ గ్యాప్ లో సినిమా స్క్రిప్ట్ ని మరింత పక్కాగా సిద్దం చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలని సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.ఇక చరణ్ పెద్ది సినిమాతో ఇప్పటికే 400 కోట్ల రూపాయలని కొల్లగొట్టిన సంగతి తెల్సిందే.చూడాలి మరి సినిమా మొదలయ్యే సమయానికి అయినా సంగీతం అందించేది ఎవరన్నది క్లారిటీ వస్తుందేమో చూడాలి !

ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానప్పటికీ, సుకుమార్ కొత్త సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపడం చూస్తుంటే ఈ బంధానికి బీటలు వారినట్లే కనిపిస్తుంది. RC17కి ఎవరు సంగీతం అందిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.