|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుమన్ శెట్టి సేఫ్.. బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. ఆ కొరియోగ్రాఫర్ ఇంటికే.. ఏమైనా ట్విస్ట్ ఉంటుందా?

Published: 13-09-2025, 7:45 AM
సుమన్ శెట్టి సేఫ్.. బిగ్ బాస్ 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. ఆ కొరియోగ్రాఫర్ ఇంటికే.. ఏమైనా ట్విస్ట్ ఉంటుందా?

బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆసక్తికరంగా సాగుతోంది. సుమన్ శెట్టి సేఫ్ అయ్యారు, కానీ కొందరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Key Points

1

సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు!

2

ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ బాటమ్ 2లో ఉన్నారు.

4

ఈ వారం ఒకటే ఎలిమినేషన్ ఉంటుందా? ట్విస్ట్ ఉంటుందా?

ఫస్ట్ వీక్ నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫస్ట్ వీకెండ్ కు టైమ్ ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లోనే హోస్ట్ నాగార్జున రాబోతున్నారు. ఈ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఓనర్లు, టెనెంట్స్ అంటూ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు జరుగుతోంది. మరి బిగ్ బాస్ తెలుగు 9లో ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేటర్ అవుతారన్నది తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది.

సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్ లోకి కంటెస్టెంట్ గా వచ్చారు. కానీ ఆయన హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మిగతా కంటెస్టెంట్లతో అంత త్వరగా కలవలేకపోయారు. ఈ కారణంతోనే సుమన్ శెట్టిని నామినేట్ కూడా చేశారు. అప్పటి ట్రెండ్ చూస్తే సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ లోనే ఇంటికి వెళ్లిపోతారని అనిపించింది. కానీ ఆడియన్స్, ఫ్యాన్స్ ఆయనకు అండగా నిలిచారు. క్రమంగా సుమన్ శెట్టి ఇన్వాల్వ్ మెంట్ కూడా పెరగడం, వాయిస్ పెంచడంతో ఓట్లు బాగానే పడ్డాయి.

బాటమ్ లో ఉంటారనుకున్న సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి టాప్ లోకి వెళ్లిపోయారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఆయనకు కనీసం మరో వారం హౌస్ లో కొనసాగేందుకు అవకాశం దక్కింది. వచ్చే వారం సుమన్ శెట్టి ప్రదర్శన బట్టి ఫ్యూచర్ ఆధారపడి ఉంది.

ఎలిమినేషన్ ప్రమాదం

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఫస్ట్ వీక్ లో 9 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 8 మంది సెలబ్రిటీలు, ఓ కామనర్. సెలబ్రిటీల్లో తనుజ, సుమన్ శెట్టి, ఇమ్యాన్యుయెల్, సంజన గల్రానీ, రాము రాథోడ్, రీతూ చౌదరి, ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ నామినేట్ అయ్యారు. కామనర్ డీమాన్ పవన్ ఈ లిస్ట్ లో ఉన్నాడు.

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ ముగిసే టైమ్ కు ఫస్ట్ వీక్ నామినేషన్లలో ఉన్నవాళ్లలో తనుజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన, రాము రాథోడ్, రీతూ చౌదరీ టాప్-7లో ఉన్నారు. వీళ్లు ఎలిమినేషన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ మాత్రం బాటమ్-2లో నిలిచి డేంజర్ జోన్లో ఉన్నారు.

ఆసక్తికర ట్విస్ట్?

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయి ఎవరు ఇంటికి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ లిస్ట్ చూస్తే బాటమ్ 2లో ఉన్న వాళ్లలో శ్రష్టి వర్మదే చివరి స్థానం. ఈ లేడీ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయేందుకు చాలా దగ్గర్లో ఉంది. మరి ఈ వారం ఒకటే ఎలిమినేషన్ ఉంటుందా? లేదా డబుల్ ఎలిమినేషన్ తో ఫస్ట్ వీక్ ట్విస్ట్ ఇస్తారా? అన్న చర్చ కూడా సాగుతోంది.

కానీ బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఇది ఫస్ట్ వీక్ మాత్రమే. అంతే కాకుండా ఫ్లోరా సైనీ లాంటి బ్యూటీఫుల్ లేడీని ఇప్పుడే షో నుంచి పంపించే ప్రయత్నం చేయకపోవచ్చు. అందుకే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మకు హౌస్ నుంచి ఎలిమినేషన్ తప్పక పోవచ్చు.

బిగ్ బాస్ హౌస్ లో ఉద్రేకాలు, ఊహించని ట్విస్టులు ఇంకా వస్తాయని అనిపిస్తుంది. మరి శ్రష్టి వర్మ ఇంటికి వెళ్తుందా? వచ్చే వారం ఎపిసోడ్స్ కోసం ఎదురు చూద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.