|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీతారామం సీక్వెల్ ఉంటుందా? మృణాల్ ఠాకూర్ కు సుమంత్ సారీ చెప్పడానికి అసలు కారణమిదే!

Published: 07-04-2026, 2:05 PM
సీతారామం సీక్వెల్ ఉంటుందా? మృణాల్ ఠాకూర్ కు సుమంత్ సారీ చెప్పడానికి అసలు కారణమిదే!
  • డెకాయిట్ ప్రీ రిలీజ్ వేడుకలో సుమంత్ మృణాళ్ ఠాకూర్ కు క్షమాపణలు తెలిపారు.
  • సీతారామంలో రామ్ ను దూరం చేసినందుకు సుమంత్ సారీ చెప్పారు.
  • క్షమాపణలకు బదులుగా మరిన్ని సినిమాల్లో అవకాశం కావాలని మృణాళ్ కోరింది.
  • ఏప్రిల్ 10న డెకాయిట్ సినిమా విడుదల కానుంది.

అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటిస్తున్న డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు సుమంత్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కు క్షమాపణలు చెప్పారు. సీతారామంలో చేసిన పాత్ర గురించి ఆయన సరదాగా స్పందించారు.

సుమంత్ క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటి?

Decoit Pre Release: అడివి శేష్ మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. ఈ సినిమా ఏప్రిల్ 10 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు హీరోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెంకటేష్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ హీరో సుమంత్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సుమంత్ వేదికపై మాట్లాడుతూ సినిమా గురించి అలాగే ఆ నిర్మాత అయిన తన సోదరి సుప్రియ యార్లగడ్డ గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ఇక ఈ వేదిక పైనే హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)గురించి మాట్లాడుతూ ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇలా సుమంత్(Sumanth) క్షమాపణలు చెప్పడానికి కూడా కారణం లేకపోలేదు. సుమంత్ మృణాళ్ ఠాకూర్ దుల్కర్ సల్మాన్(Dulquer Salman) హీరో హీరోయిన్లుగా నటించిన సీతారామం(Sita ramam) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో సుమంత్ నటించారు.

మృణాళ్ ఠాకూర్ రియాక్షన్ ఎలా ఉంది?

ఈ సినిమాలో సుమంత్ కారణంగానే రామ్ సీతకు దూరమవ్వడం జరుగుతుంది. అయితే సినిమాలో తనకు రామ్ ను దూరం చేసినందుకు క్షమించండి అంటూ ఈ సందర్భంగా ఈయన క్షమాపణలు కోరడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాలో తాను సీతకు క్షమాపణలు చెప్పే లాగా ఒక సీన్ ఉంది. అయితే ఎడిటింగ్ లో ఆ సీన్ తీసేసారు. అందుకే ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నాను అంటూ సుమంత్ క్షమాపణలు చెప్పారు అలాగే తన నుంచి రామ్ ను దూరం చేసినందుకు తనకు డెకాయిట్ ఛాన్స్ వచ్చిందని ఈ సందర్భంగా సుమంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

క్షమాపణలకు ఒక్క సినిమా సరిపోదు..

డెకాయిట్ సినిమా విశేషాలు

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ కార్యక్రమంలో సుమంత్ మృణాళ్ కు క్షమాపణలు చెప్పడంతో ఆమె కూడా స్పందిస్తూ సుమంత్ అన్నా మీరు క్షమాపణలు చెబితే సరిపోదు మీ క్షమాపణలకు ఒక డెకాయిట్ మాత్రమే కాదు నాకు ఇంకా మూడు నాలుగు సినిమాలలో చేసే అవకాశం ఇస్తేనే సరిపోతుంది అంటూ ఈమె కూడా సరదాగా మాట్లాడారు. వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డెకాయిట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి. మరి ఏప్రిల్ 10న రాబోతున్న డెకాయిట్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

సుమంత్, మృణాళ్ ల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెకాయిట్ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.