|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమర్ దీప్ ‘సుమతి శతకం’ ట్రైలర్ విడుదల: పెళ్లి కష్టాలు ఎలా గట్టెక్కాడో చూడండి!

Published: 29-01-2026, 8:35 AM
అమర్ దీప్ 'సుమతి శతకం' ట్రైలర్ విడుదల: పెళ్లి కష్టాలు ఎలా గట్టెక్కాడో చూడండి!
  • అమర్ దీప్ హీరోగా ‘సుమతి శతకం’ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
  • ట్రైలర్ లో హీరో పెళ్లి చేసుకోవడానికి పడే కష్టాలు చూపించారు.
  • ఈ సినిమాలో శైలీ హీరోయిన్ గా నటిస్తోంది.
  • మైత్రి మూవీ మేకర్స్ వారి సారథ్యంలో ఈ సినిమా విడుదల కానుంది.

బుల్లితెర నటుడు అమర్ దీప్ ‘సుమతి శతకం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో పెళ్లి కోసం హీరో పడే కష్టాలను చూపించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

సుమతి శతకం ట్రైలర్ విశేషాలు

Sumathi Sathakam Trailer: అమర్ దీప్ చౌదరి హీరోగా పరిచయం అవుతూ సుమతి శతకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నేడు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ట్రైలర్ మొదట్లోనే నాకు తొందరగా పెళ్లి చేసేయండి సార్ అంటూ చెప్పే డైలాగులు చూస్తుంటే ఈ సినిమాలో హీరో అమర్ దీప్ పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో తంతాలు పడుతుంటారని స్పష్టమవుతుంది.

ఇక ఇక ఈ ట్రైలర్ వీడియోలో టేస్టీ తేజ హీరోతో మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యే చెప్పింది నిజమేనన్న అంటూ ప్రేమంటే సులువు కాదురా.. అనే పాట గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. పెళ్లి చేసుకోవడం కోసం హీరోకి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి వాటిని ఎలా ఎదుర్కొన్నారు చివరికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? అనే నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతుందని తాజాగా ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాలో శైలీ హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె అంగన్ వాడి టీచర్ గా కనిపించబోతున్నారు. మొత్తానికి ఈ ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తుంది.

హీరోగా అమర్ దీప్ పరిచయం

ఈ సినిమా విషయానికి వస్తే.. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో ఎం ఎం నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారి సారథ్యంలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టేస్టీ తేజ, విట్టా మహేష్ వంటి తదితరులు కూడా నటించారు.. బుల్లితెర పై నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అమర్ వెండితెరపై హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఈయన హీరోగా రాబోతున్న మొదటి సినిమా కావటం విశేషం.

అమర్ దీప్ బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమైన పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈయన ఈ రియాలిటీ షోలో రన్నర్ గా బయటకు వచ్చారు. అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అమర్ బీబీ జోడి సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా బిజీగా ఉన్నారు. మరి ఫిబ్రవరి 6వ తేదీ హీరోగా సుమతి శతకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమర్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల షూటింగ్ పనులలో కూడా బిజీగా గడుపుతున్నారు.

సినిమాలో ఇతర నటీనటులు

‘సుమతి శతకం’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అమర్ దీప్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమాలో టేస్టీ తేజ, విట్టా మహేష్ తదితరులు నటించారు. సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.