|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sunil : తమిళ ఇండస్ట్రీలోకి మరో టాలీవుడ్ నటుడు.. అఫీషియల్ పోస్టర్ వైరల్

Published: 08-06-2025, 11:49 AM

టాలీవుడ్ నటుడు సునీల్, రాజ్ తరుణ్ నటించే తమిళ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘గోలిసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రం, విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతోంది. సునీల్ తమిళ సినిమాలో అడుగుపెట్టడం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Key Points

1

సునీల్ రాజ్ తరుణ్ తమిళ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

2

ఈ సినిమా 'గోలిసోడా' ఫ్రాంచైజీలో భాగం.

4

విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

సునీల్ తమిళ సినిమాలో అడుగు

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తమిళ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హై-ఎనర్జీ, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ‘గోలిసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతుంది. ఈ మూవీలో రాజ్ తరుణ్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రను పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. టాలీవుడ్‌లో హాస్య నటుడుగా, హీరో, విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సునీల్.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యాడు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘రాజ్ తరుణ్ అండ్ విజయ్ మిల్టన్ ప్రాజెక్టులో నటుడు సునీల్ భాగం అయ్యారు. ఈ సినిమా టైటిల్‌ను జూన్ 15న ప్రకటిస్తాము’ అంటూ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో డైరెక్టర్ విజయ్ మిల్టన్ అండ్ సునీల్ దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు.

Actor #Sunil on board for #RajTarunXVijayMilton TITLE ANNOUNCEMENT On June 15th! pic.twitter.com/wjUnHmnKLz

‘గోలిసోడా’ ఫ్రాంచైజీలో మరో చిత్రం

జూన్ 15న టైటిల్ ప్రకటన

చివరగా, సునీల్ తమిళ సినిమాలో అడుగుపెట్టడం తో పాటు, రాజ్ తరుణ్ మరియు విజయ్ మిల్టన్ ప్రాజెక్ట్‌కు మరింత ఆసక్తిని కలిగించింది. జూన్ 15న వచ్చే టైటిల్ ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.